గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే నిజమైన దేశ భక్తుడని ట్వీట్ చేసిన మెగా బ్రదర్
మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరతో పాటు అటు బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా రాజకీయాలపైన సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అప్పుడప్పడూ వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ఇప్పుడు తాజాగా నాగబాబు మరో ట్వీట్ తో వివాదానికి తెరలేపాడు. ఎప్పుడు ప్రత్యర్థులతో విమర్శలు ఎదుర్కొనే నాగబాబు ఇప్పుడు సొంత పార్టీ వాళ్ల నుంచే విమర్శలు ఎదుర్కొనేలా చేస్తున్నాయి ఆయన పెట్టిన ట్వీట్స్. మహాత్మ గాంధీజీని చంపిన నాథూరామ్ గాడ్సేను ఇండియాలో గొప్ప దేశభక్తుడిగా అభివర్ణిస్తూ.. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశమని వివాదాస్పద చర్చకు దారిచూపాడు.
నాగబాబు తన ట్విట్టర్ లో ''ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కదా అనేది డిబేటబుల్. కానీ అతని వైపు ఆర్గుమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే... మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్'' అని ట్వీట్ చేసాడు. అక్కడితో ఆగకుండా 'నాథురాం గాడ్సే చివరి మాట' అనే యూట్యూబ్ లింక్ ని కూడా పోస్ట్ చేసాడు. దీంతో మెగా బ్రదర్ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీరిలో ఎక్కువగా మెగా అభిమానులు ఉండటం విశేషం.
''ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం.. రాజకీయాలకి సంబంధం లేనీ ట్వీట్లు వేయడం వల్ల 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ సిద్ధాంతం జనాలోకి వెళ్ళలేదు. మీరు ఎలాగు పార్టీ కి నిలబడలేరు. గోపిల్లాగా ఉంటున్నారు. కొంచెం సబ్జెక్ట్ మీద మాట్లాడడం పార్టీకి మంచిది'' అంటూ సలహా ఇస్తున్నారు. మరొక మెగా అభిమాని ట్వీట్ చేస్తూ.. ''మీ మాటలు ఎలా ఉన్నాయంటే కసబ్ కూడా మంచి వాడే.. పాపం తాను నమ్మిన సిద్దాంతం కోసం యుద్ధం చేశాడు. తన దేశభక్తిని శంకించలేం అన్నట్లుంది. బిజేపిని తిట్టడం. మళ్ళీ కలవడం. ఏదో సర్దుకుపోయాం. మరీ ఇంతలా కలవక్కర్లేదు. మీ వల్ల మళ్ళీ జనసైనికుల గౌరవం పోయేలా చేస్తున్నారు. ఆపండి అన్నా'' అంటూ రిప్లై ఇచ్చాడు. ''మీ దృష్టిలో గాడ్సే దేశభక్తుడు మరియు గాంధీజీ దేశభక్తుడు కాదు.. అందుకేనా దేశ ప్రజలు గాంధీజీని 'జాతిపిత' 'మహాత్మా' అంటారు. ఏవేవో ట్వీట్స్ పెట్టి మీ కుటుంబీకుల పరువు తీయ్యొద్దు. ఇంకోసారి ఇలాంటి ట్వీట్ చేస్తే నాలాంటి 7% వాళ్ళు కూడా ఓట్లు వేయరు'' అంటూ ఫైర్ అవుతున్నారు.
మరికొంతమంది నాగబాబుకు ఏదో అయింది.. ఆర్జీవీ పూనినట్లున్నాడు అందుకే ఇలా పిచ్చి పిచ్చి ట్వీట్స్ పెడుతున్నాడంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భాజపాను లేపుతున్నాడనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తుండగా.. ఇప్పుడు నాగబాబు ఇలాంటి ట్వీట్స్ పెట్టి ఆరెస్సెస్ భావజాలకులకు దగ్గరవ్వాలని చూస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది ఆరెస్సెస్ భావజాలకులు బహిరంగంగానే గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ కీర్తించడం మనం గతంలో చాలాసార్లు చూసాం. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యలు ఎక్కడి దాకా దారితీస్తాయో చూడాలి.