30 ఏళ్ల నో కిస్సింగ్ పాలసీ.. బ్రేక్ చేయడం పై కాజోల్ క్లారిటీ!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కాజోల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.;

Update: 2026-04-24 15:30 GMT

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కాజోల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత కుచ్ కుచ్ హోతా హై సినిమాతో కమర్షియల్ విజయాన్ని అందుకుంది. కభీ ఖుషీ కభీ ఘం, ఫనా ఇలా ఎన్నో చిత్రాలు ఈమె కెరియర్ కు పునాది వేసాయి. పదహారేళ్లకే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. గత మూడు దశాబ్దాలుగా నో కిస్ పాలసీని అనుసరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

30 ఏళ్ల నాటి నియమాన్ని పక్కన పెట్టిన కాజోల్..

అలాంటి ఈమె సడన్గా 2023లో వచ్చిన 'ద ట్రయల్' వెబ్ సిరీస్ కోసం తన మూడు దశాబ్దాల నియమాలను పక్కనపెట్టి మరీ ఇందులో లిప్ లాక్ సన్నివేశాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒకవైపు హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతున్న కాజోల్ లిల్లీ సింగ్ నిర్వహించిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని తన 30 సంవత్సరాలుగా పెట్టుకున్న నో కిస్సింగ్ పాలసీని బ్రేక్ చేయడంపై స్పందించింది..

అందుకే రూల్స్ బ్రేక్ చేశా..

కాజోల్ మాట్లాడుతూ.." నిజం చెప్పాలి అంటే ద ట్రయల్ వెబ్ సిరీస్ లో నేను పోషించిన పాత్ర డిమాండ్ అలాంటిది. నయోనిక పాత్ర ఎలాంటి పరిస్థితుల్లో ఉంది. అసలు ఆ పాత్ర ఏం కోరుకుంటుంది అనేదానితో ఆ సీన్ కి చాలా సంబంధం ఉంది. అది కేవలం ముద్దు సీన్ మాత్రమే కాదు స్క్రీన్ ప్లే లో అంతర్భాగం కూడా.. ఇక ఆ సీన్ తీసేస్తే ఆ పాత్రలోని ఎమోషన్ పూర్తిగా దెబ్బతింటుంది. పైగా ఆ సీన్ లేకపోతే సినిమాకి సోల్ ఉండదు. అందుకే కాస్త ప్రొఫెషనల్ గా ఆలోచించి నా నియమాలను పక్కనపెట్టి ఇందులో నాతోటి నటుడిగా నటించిన జిషూ సేన్ గుప్తాతో నేను లిప్ లాక్ సీన్ చేయాల్సి వచ్చింది " అంటూ తెలిపింది కాజోల్. మొత్తానికి అయితే కాజోల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ద ట్రయల్ స్టోరీ..

ఇక కాజోల్ నటించిన ద ట్రయల్ - ప్యార్, కానూన్,ధోఖా సిరీస్ స్టోరీ విషయానికి వస్తే.. అమెరికన్ సిరీస్ ద గుడ్ వైఫ్ కి ఇండియన్ అడాప్టేషన్ సిరీస్ ఇది. ఇందులో కాజోల్ భర్త కుంభకోణంలో చిక్కుకున్నాక.. మళ్ళీ లాయర్ గా తన కెరీర్ ను ప్రారంభించే నయోనిక సేన్ గుప్తా పాత్రలో నటించారు కాజోల్. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ కోర్టు రూమ్ డ్రామా లో అలీ ఖాన్, షిభా చద్దా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సీజన్ 1 2022లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.


Full View


Tags:    

Similar News