గ్లామర్ డోస్ పెంచేసిన కృతి సనన్.. బ్లాక్ అవుట్ ఫిట్ లో మరింత హీట్ పెంచుతూ!

అసలే సమ్మర్.. సూర్య భగవానుడి భగభగ మంటలకు ప్రజలు అల్లాడిపోతుంటే .. హీరోయిన్లు కూడా ఆ వేడిని మరింత పెంచడానికి సెగలు పుట్టించేలా ఔట్ ఫిట్స్ ధరిస్తూ సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తున్నారు.;

Update: 2026-04-24 11:25 GMT

అసలే సమ్మర్.. సూర్య భగవానుడి భగభగ మంటలకు ప్రజలు అల్లాడిపోతుంటే .. హీరోయిన్లు కూడా ఆ వేడిని మరింత పెంచడానికి సెగలు పుట్టించేలా ఔట్ ఫిట్స్ ధరిస్తూ సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఒకరి తర్వాత ఒకరు.. ఒకరితో ఒకరు పోటీపడుతూ గ్లామర్ విందు వడ్డిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు . ఇక సోషల్ మీడియా వాడకం ఎప్పుడైతే పెరిగిపోయిందో అటు చిన్న పిల్లల్ని మొదలుకొని పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ లేనిదే గడవని రోజులు . అలాంటి ఈ సమయంలో హీరోయిన్స్ కూడా తమ అందాలను ఎరగా వేసి క్యాష్ చేసుకుంటున్నారు అనే వార్తలు ఎప్పటికప్పుడు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.




ఈ క్రమంలోనే అలా అందాలతో మరింత హీట్ పెంచుతూ బ్లాక్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టించే ప్రయత్నం చేసింది కృతి సనన్. విభిన్నమైన ఫోజులు ఇస్తూ సెగలు పుట్టించేలా ఫోటోలకు పంచుకుంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో కృతి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. లెదర్ మెటీరియల్ ను తలపించేలా బ్లాక్ డ్రెస్ ధరించిన ఈమె తన అవుట్ ఫిట్ ను మరింత అందంగా మార్చుకుంది. హుందాగా ఫోటోలకు ఫోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. మరికొన్ని ఫోటోలలో రొమాంటిక్ గా ఫోజులిస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలా మొత్తానికైతే కృతి తాజాగా షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.




ఇండస్ట్రీలోకి రాకముందు పెద్ద పెద్ద కంపెనీల కమర్షియల్ యాడ్స్ లలో నటించిన ఈమె.. తొలిసారి తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన 1: నేనొక్కడినే అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందం , హైట్ తో అందర్నీ ఆకట్టుకున్న కృతి సనన్.. హిందీలో జాకీ ష్రాఫ్ వారసుడు టైగర్ ష్రాఫ్ తో హీరోపంతి సినిమాలో నటించి హిందీ రంగ ప్రవేశం చేసిం.ది ఇక తర్వాత ఆది పురుష్ సినిమాలో సీత పాత్ర పోషించి.. ఇటు తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది కృతి సనన్.




హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా కాక్ టెయిల్ 2 సినిమాలో నటిస్తోంది. రష్మిక మందన్నతో కలిసి నటిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది ఈ చిన్నది.. మరి ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News