మంచు విష్ణు చేసిన మోసంపై నాగబాబు సంచలన ఆరోపణ

Update: 2021-10-09 05:32 GMT
‘మా’ ఎన్నికల పోలింగ్ వేళ మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగాడు. ఓటింగ్ ఈరోజు మొదలు కాకముందు ఒక హాట్ వీడియోను విడుదల చేశారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లకు ఎందుకు ఓటు వేయాలి? ఎందుకు వేయకూడదనే అంశాలపై ‘మా’ సభ్యులకు క్లారిటీ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ను నాన్ లోకల్, నిర్మాతలతో పెట్టుకున్న గొడవలపై మాట్లాడుతున్న వారు మంచు విష్ణు ఒక దర్శకుడిని మోసం చేసిన వైనంపై ఎందుకు ప్రశ్నించరని నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు.

ప్రకాష్ రాజ్ కు ఎందుకు ఓటు వేయాలనే దానిపై నాగబాబు ఓ వీడియో రూపంలో తెలిపారు. ప్రకాష్ రాజ్ కింద నుంచి పైకి వచ్చాడని.. ఊరూరా తిరిగి నాటకాలు వేశాడని.. నటుల కష్టాలు ఆయనకు బాగా తెలుసు అని నాగబాబు చెప్పుకొచ్చారు. కళ్ల నిండా కలలు పెట్టుకొని తిరిగాడు కాబట్టి ఆయనకు సినిమా ఆర్టిస్టుల కష్టాలు తెలుసు అన్నారు. అనేక భాషల్లో నటిస్తున్నాడు కాబట్టి సినిమా ఆర్టిస్టులకు ఏం కావాలో తెలుసు. ప్రపంచ సాహిత్యాన్ని చదివాడు.. సంఘం విలువ తెలుసు. అలాగే ఒక దేశ ప్రధానితో పోరాడటం తెలుసు అని ప్రకాష్ గురించి గొప్పగా చెప్పాడు.

అలాగే మంచు విష్ణు కేవలం మోహన్ బాబు గారి అబ్బాయి. ఇండస్ట్రీలో పుట్టిన మనిషి, వాళ్ల నాన్న గారు 500 సినిమాల్లో నటించారు. ఒక విద్యా సంస్థను నడిపిస్తున్నారు. అంతే అని అన్నారు.

ఇక నిర్మాతలతో ప్రకాష్ రాజ్ కు వివాదాలు ఉన్నాయని విమర్శిస్తున్నారని.. మంచు విష్ణుకు అలాంటివి లేవా? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ‘సలీమ్’ సినిమా సమయంలో వైవీఎస్ చౌదరి రెమ్యూనరేషన్ సమయంలో మంచు విష్ణు మోసం చేశాడని ఆయన కోర్టుకెక్కిన సంగతి మరిచిపోయారా? అని నాగబాబు ప్రశ్నించారు. కోర్టు మొట్టికాయలు వేసిందని తెలుగు వాళ్లకు తెలియదా? అని నాగబాబు ప్రశ్నించారు. ఆయన పెద్ద దర్శకుడు కాబట్టి ఎదురు నిలబడ్డాడని.. మరి సామాన్యుల పరిస్థితి ఏంటని నాగబాబు ప్రశ్నించారు.

‘ప్రకాష్ రాజ్ ను తెలుగోడు అంటారు.. నిన్ను తెలుగు నేర్చుకో అంటారు’ అని నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ను మంచు విష్ణుకు ఇచ్చాడు.


Tags:    

Similar News