మెగా బ్రదర్ బరువు తగ్గడానికి కారణం అదేనా...?
మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరతో పాటు అటు బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా రాజకీయాలపైన సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. కాగా నాగబాబు ఈ మధ్య లుక్ పరంగా చాలా మారిపోయాడు. బరువు తగ్గిపోయి పూర్తిగా మేకోవర్ అయిపోయాడు. అసలు నాగబాబును చూసి ఫ్యాన్స్ కూడా బాబు గారికి ఏమైంది అని ఆలోచిస్తున్నారు. ఈయనేంటి బరువు తగ్గి ఇంతగా మారిపోయాడు అంటూ షాక్ అవుతున్నారు. పోయిన ఏడాది ఎలక్షన్స్ లో జనసేన తరపున పోటీ చేసిన సమయంలో బొద్దుగా కనిపించిన నాగబాబు ఇంత తక్కువ కాలంలో బక్కగా ఎలా మారిపోయాడు అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ముందుటి ఫొటోస్ తో ఇప్పటి ఫొటోస్ కంపేర్ చేసి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. అయితే నాగబాబుని చూసిన అభిమానులు ఏదైనా బారియాట్రిక్ లాంటి సర్జరీలు చేయించుకొని అలా మారిపోయాడా అనే డౌట్స్ వ్యక్తం చేసారు.
నాగబాబు ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసిన వీడియోలలో.. లాక్ డౌన్ లో వరుణ్ తేజ్ - నిహారికా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ లో ఆయన్ని చూసిన వారికి సన్నగా కనిపించడమే కాకుండా.. తలపై వెంట్రుకలు కూడా ఊడిపోయాయనే విషయం అర్థం అవుతుంది. నాగబాబు అకస్మాత్తుగా ఇంత బరువు తగ్గడంతో మెగా బ్రదర్ ఆరోగ్యం బాగానే ఉందా అని మెగా అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల దీనిపై స్పందించిన నాగబాబు.. కొన్ని సహజ మార్గాల ద్వారా తన శరీర బరువుని తగ్గించానని చెప్పుకొచ్చాడు. అందుకే ఒక్కసారిగా వెయిట్ లాస్ అయ్యానని.. ఈ డైట్ జులై నెల వరకు కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు. కానీ నాగబాబు డైట్ ఫాలో అవుతూ సన్నబడటం మంచిదే. కానీ ఒక్కసారిగా 30 నుండి 40 కేజీల వెయిట్ కోల్పోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.