జనసేనలోకి చిరంజీవి చేరిక పై నోరు విప్పిన నాగబాబు

Update: 2020-05-01 05:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్థాపించిన ‘జనసేన’ పార్టీలోకి ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు చేరారు. ఈ అన్నాదమ్ములు ఇద్దరూ జనసేనను ఓన్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు.  అయితే అన్నయ్య చిరంజీవి కూడా వస్తే జనసేన ఎక్కడికో వెళ్లిపోతుందనే ఆశ మెగా ఫ్యాన్స్ లో ఉంది. ఈ మధ్య జనసేనలోకి చిరంజీవి చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై తాజాగా నాగబాబు స్పందించారు. ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించిన నాగబాబు  అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జనసేనలోకి చిరంజీవి చేరే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చారు.

నాగబాబు మాట్లాడుతూ.. జనసేనలో చిరంజీవి చేరే అవకాశం ఏమాత్రం లేదని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. దానికి కారణం చిరంజీవి రాజకీయాలు వదిలేసే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారని.. అప్పుడే తాను మళ్లీ ఇక రాజకీయాలలోకి అడుగుపెట్టను అని చెప్పారన్నారు.

దీన్ని బట్టి జనసేనలో చేరితే చిరంజీవి తీసుకున్న నిర్ణయం పాడవుతుందని.. తాము కూడా బలవంతం చేయడం లేదని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి తన అనుభవాన్ని మొత్తం చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఉపయోగిస్తారని.. అందుకే తాజాగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు.
Tags:    

Similar News