• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ డాటర్ కాబోయే స్టార్...

ఆ డాటర్ కాబోయే స్టార్ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2016-05-16 09:30 GMT
మెగా బ్రదర్ నాగేంద్రబాబు కొణిదెల నీహారిక హీరోయిన్ గా అరంగేట్రం చేస్తున్న మూవీ 'ఒక మనసు.' ఇప్పటికే క్రేజ్ ఉన్న కుర్ర హీరో నాగశౌర్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నా.. అతడి కంటే ఎక్కువగా నీహారిక గురించే మాట్లాడుకుంటున్నారు. 'ఒక మనసు' విషయంలో ఫోకస్ అంతా నీహారికపైనే ఉండడంతో.. ఈ హీరో ఫీల్ అవుతున్నాడనే టాక్ వినిపించింది.

త్వరలో రొమాంటిక్ మూవీ తెరకెక్కిన 'ఒక మనసు'ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీజర్ లాంఛ్ పూర్తి కాగా.. త్వరలో ఆడియో లాంఛ్ చూడా జరగనుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు ప్రధాన సభ్యులు. ఇందులో భాగంగా నీహారిక డామినేషన్ అనే టాపిక్ పైనా స్పందించాడు హీరో నాగ శౌర్య. 'నీహారిక నటన ఎంతో నేచురల్ గా, వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఒక మనసు రిలీజ్ అయ్యాక.. ఆమె తప్పనిసరిగా స్టార్ హీరోయిన్ అయిపోతుంది. ప్రతీ ఒక్కరూ ఆమెను - ఆమె నటనను ప్రేమిస్తారు. 'అంటూ నీహారికను ఆకాశానికి ఎత్తేశాడు నాగశౌర్య.

నాగశౌర్య చెప్పిన మాటలతో.. నీహారికకు వస్తున్న పబ్లిసిటీపై ఈ హీరో ఎలాంటి జెలసీ ఫీల్ అవడం లేదని అర్ధమవుతుంది. ఇప్పటివరకూ యాంకర్ గా ప్రశంసలు అందుకున్నా. ఇప్పుడు తొలిసారిగా హీరోయిన్ పాత్రకు.. తన తోటి హీరోతో ప్రశంసలు అందుకుంది. రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి త్వరలో ఆడియో ఫంక్షన్ చేయనుండగా.. దీనికి మెగా ఫ్యామిలీ హీరోలు చాలామంది హాజరు కానుండడం విశేషం.
Tags:    
  • Naga Shourya 
  • Niharika 
  • Oka Manasu movie 
  • Telugu nEws 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS