• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #వ‌రుడు ఏంటో కానీ.....

#వ‌రుడు ఏంటో కానీ.. పెళ్లిని కూడా వ‌దిలిపెట్ట‌రా?

By - Tupaki Desk
Update: 2021-10-25 04:32 GMT
ప‌బ్లిసిటీ కోసం మ‌నవాళ్లు దేనినీ వ‌ద‌లిపెట్ట‌డం లేదు. పెళ్లిని కూడా త‌మ సినిమా ప్ర‌మోష‌న్ కి వాడేసాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య‌. త‌ను న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను` ప్ర‌మోష‌న్స్ కోసం ఎంచుకున్న వేదిక తాజాగా చ‌ర్చ‌కు వచ్చింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 29న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా  చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ని చిత్ర బృందం ప్రారంభించింది. ఇటీవ‌ల సంగీత్ ఈవెంట్ అంటూ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. అయితే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్న హీరో నాగ‌శౌర్య ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం ఏ చిన్న ఛాన్స్ దొరికినా వ‌ద‌ల‌డం లేదు. తాజాగా ఓ పెళ్లి వేడుక‌ని కూడా త‌మ చిత్ర ప్ర‌చారం కోసం వాడేశారు.

ట్రైల‌ర్ లాంచ్ ని క్రేజీ హీరోయిన్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేతో చేయించిన టీమ్ ప్ర‌చార జోరుని పెంచేశారు. ఇదే క్ర‌మంలో హీరో నాగ‌శౌర్య‌.. హీరోయిన్ రీతూ వ‌ర్మ ఇద్ద‌రూ క‌లిసి ఓ పెళ్లి వేడుక‌లో త‌ళుక్కున మెరిసారు. అనార్క‌లీ డ్రెస్ లో రీతూ వ‌ర్మ‌.. సెమీ ఫార్మ‌ల్ డ్రెస్ లో హీరో నాగ‌శౌర్య ఓ పెళ్లి వేడుక‌లో సంద‌డి చేశారు. నూత‌న జంట‌ని జంట‌గా ఆశీర్వ‌దించారు కూడా. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. యంగ్ హీరో త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం పెళ్లిని కూడా వ‌ద‌ల లేదు క‌దా అని నెటిజ‌న్స్ కామెంట్‌లు కురిపిస్తున్నారు.

లేడీ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతోంది. శౌర్య‌- రీతూ వ‌ర్మ తొలి క‌ల‌యిక‌లో ఈ మూవీని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. కుటుంబ ఆడియెన్ ని థియేట‌ర్ల‌కు రప్పించ‌డ‌మే ధ్యేయంగా ఈ సినిమా కంటెంట్ ని మ‌లిచార‌ని తెలుస్తోంది.
Tags:    
  • naga shourya wedding 
  • varudu kavalenu 
  • varudu kavalenu Release date 
  • varudu kavalenu Trailer 
  • Naga Shourya 
  • Ritu Varma 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS