#NS22 సాఫ్ట్ గా క‌నిపిస్తారు లొల్లి లొల్లి చేస్తారు!

Update: 2020-12-09 06:34 GMT
సాఫ్ట్ గా క‌నిపిస్తారు.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లం అంటారు. స‌రే క‌దా అని ఆఫీస్ కి వెళితే అక్క‌డ అంతా లొల్లి లొల్లి. ప‌క్కా మాస్ కే బాప్ అని తేలిపోతుంది వ్య‌వ‌హారం. ఇక్క‌డ సీన్ చూస్తుంటే అలానే ఉంది మ‌రి. ఎ క్క‌డా..?

NS22 సెట్స్ లో మొదటి రోజు స‌న్నివేశ‌మిదీ.. వినోదం ప్రారంభమైంది! అంటూ నాగ‌శౌర్య టీమ్ ఒక‌టే సంద‌డి చేస్తోంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాకి అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  సెట్స్ లో మొదటి రోజు ఫ‌న్ ఒక రేంజులోనే వ‌ర్క‌వుటైందిగా. ఇలా ఎంతో ప్లెజెంట్ గా ఓకే ఓకే అంటూ బోలెడంత ర‌చ్చ చేసారు. ప్ర‌తిదీ ఫ‌న్ లా సాగాలి. అప్పుడే కిక్కు అన్న‌ట్టుగా టీమ్ అంతా ఎంతో జోష్ తో క‌నిపిస్తోంది.

హాస్యనటులు స‌త్య‌- రాహుల్ రామకృష్ణ ఎంతో  జోష్ తో క‌నిపిస్తున్నారు సెట్లో. ఈ ఫిగ‌ర్ మ‌న‌దే అంటూ నాగ‌శౌర్య ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఈ వీడియో వాస్తవానికి చిత్ర‌బృందాన్ని  ప‌రిచ‌యం చేయ‌డం అనే చెప్పాలి. దర్శకనిర్మాత‌లు తారాగణం చిత్ర సాంకేతిక సిబ్బంది మధ్య సాధారణ సంభాషణకు సంబంధించిన వీడియో ఎంతో ఫ‌న్ తో ఆక‌ట్టుకుంది.

ప్రతిదీ సరిగ్గా ఉందా (ఓకేనా?) అని అడుగుతుంటే ద‌ర్శ‌కుడు అనీష్ ఓకే ఓకే అన‌డం బావుంది. న‌టీనటులు అలంకరణ.. గెటప్ మాడ్యులేషన్ అంతా ఓకే. కెమెరామెన్ ప‌రిచ‌యం మొద‌లు ఆర్టిస్టులు ద‌ర్శ‌కుడు.. నిర్మాత (ఐరాధినేత‌) అంద‌రినీ ఒక‌రొక‌రిగా ప‌రిచ‌యం చేయ‌డం ఇంట్రెస్టింగ్. ఇలా ప‌రిచ‌యం చేసుకుంటే ప‌ని సులువు అవుతుంది మ‌రి.

నాగ‌ శౌర్య చూస్తుండ‌గానే 22వ సినిమాలో న‌టించేస్తున్నాడు. అత‌డు ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ ఆస‌క్తిక‌ర కాన్సెప్టుల్ని ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు. న‌వ‌త‌రం హీరోల్లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. ఈసారి అనీష్ కృష్ణ‌తో క‌లిసి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. మహతి స్వరా సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ ప‌తాకంపై ఉషా ముల్పురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




Full View
Tags:    

Similar News