• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త కారులో...

కొత్త కారులో ‘ఛలో'-ప్రేమతో అమ్మ

By - Tupaki Desk
Update: 2018-02-27 06:08 GMT
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సక్సెస్ ఛలో రూపంలో ఎదురు కావడంతో హీరో నాగ శౌర్య ఆనందానికి అంతు లేదు. పోటీ తీవ్రంగా ఉన్న టైంలో విడుదలైనా తట్టుకుని మరీ నిలిచి ఇప్పటి దాకా 28 కోట్ల గ్రాస్ సాధించి  చిన్న సినిమాగా పెద్ద విజయం గెలుచుకుంది. ఇంకా చాలా కేంద్రాల్లో డెఫిషిట్ లేకుండా ఛలో స్టడీగా రన్ అవుతూనే ఉంది. మంచి హాస్యంతో ఫీల్ గుడ్ లవ్ స్టొరీ గా యూత్ - ఫ్యామిలీస్ ని బాలన్స్ చేస్తూ దర్శకుడు వెంకీ కుడుముల తీర్చిదిద్దిన తీరు అందరిని మెప్పించింది. దీనికి నిర్మాతలుగా తన కుటుంబ సభ్యులే వ్యవహరించడం నాగ శౌర్యను కొంత టెన్షన్ పెట్టినా చివరికి ఘన విజయం దక్కడంతో ఫ్యామిలీ కూడా ఫుల్ హ్యాపీ గా ఉంది. దీన్ని సెలెబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో ఛలో నిర్మాత - నాగ శౌర్య తల్లి ఉషా మల్పూరి కొత్త 
(Porshe Cayman 718)
కారును కానుకగా అందించారు.

అసలే సక్సెస్ ఇచ్చిన కిక్ తో మబ్బుల్లో తేలుతున్న నాగ శౌర్యకు అమ్మ ఇచ్చిన (Porshe Cayman 718) కారు కానుక దానికి మించిన కిక్ ఇస్తోంది. ఇకపై తన రైడ్స్ అన్ని ఇందులోనే అంటున్న నాగ శౌర్య కొత్త సినిమా కణం వచ్చే నెల విడుదల కానుంది. సాయి పల్లవి హీరొయిన్ గా నటించిన ఈ మూవీ ఆడియో తమిళ్ లో ఇటీవలే విడుదల అయ్యింది. తెలుగు వెర్షన్ ప్రమోషన్ ఇంకా మొదలు పెట్టలేదు. ఛలో సమయంలోనే ఒప్పుకున్న కథ ఇది. థ్రిల్లర్ తరహాలో రూపొందుతున్న కణంకు ఛలోతో వచ్చిన నాగ శౌర్య ఇమేజ్ ఓపెనింగ్స్ కు బాగా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం కొత్త సినిమా కోసం కథలు వినే పనిలో ఉన్న నాగ శౌర్య ఎంపికలో ఎటువంటి పొరపాటు చేయను అంటున్నాడు.

గత ఏడాది కథలో రాజకుమారి తీవ్రంగా నిరాశ పరిచినా ఛలో మొత్తం కవర్ చేసేసింది. ఇప్పుడు కణం కూడా హిట్ అయితే ఇక దూసుకుపోవడమే. ద్విబాషా చిత్రంగా తమిళ్ - తెలుగు బాషలలో ఒకేసారి రూపొందిన కణం అక్కడ కరు పేరుతో విడుదల కానుంది. కోలీవుడ్ లో నాగ శౌర్యకు ఇదే డెబ్యు మూవీ. 
Tags:    
  • Naga Shaurya Mother 
  • porshe Cayman 718 car 
  • Naga Shaurya 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS