స‌మంత‌తో చైతూ జ‌త క‌ట్టేది అందుకేనా?

Update: 2017-06-15 06:08 GMT
నాగ‌చైత‌న్యకు సంబంధించిన ఆస‌క్తిక‌ర స‌మాచారం ఒక‌టి ఇండ‌స్ట్రీలో ఇప్ప‌డు వినిపిస్తోంది. ముందుగా అనుకున్న దాని  ప్రకారం చైతూ కోలీవుడ్ ఎంట్రీ ఇప్ప‌టికే జ‌రిగిపోవాలి. కానీ.. అది జ‌ర‌గ‌లేదు. గ‌తంలో మాదిరి హీరోలు ఒక భాష‌కే ప‌రిమితం కాకుండా.. మిగిలిన వుడ్ ల‌పైనా దృష్టి పెడుతున్నారు. త‌మ ఇమేజ్‌ ను పెంచుకుంటే.. మార్కెట్ పెర‌గ‌టంతో పాటు.. అన్ని క‌లిసి వ‌స్తాయ‌న్న‌ది ఆలోచ‌న‌.

ఇప్పుడిప్పుడే మార్కెట్ పెంచుకుంటున్న చైతూ.. వ‌చ్చే ఏడాది ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇందులో భాగంగా త‌న కాబోయే భార్య స‌హ‌కారం తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. త‌మిళ్‌ లో స‌మంత‌కు మంచి మార్కెట్టే ఉంది. ఇప్ప‌టికే ఆమె ప‌లువురు త‌మిళ అగ్ర హీరోల‌తో జ‌త క‌ట్టింది. త‌మిళ్ లో స‌మంత‌కు ఉన్న పాపులార్టీని వినియోగించుకొని త‌న ఎంట్రీని ఆస‌క్తిక‌రంగా మ‌ల్చుకోవాల‌ని చైతూ ప్లాన్ చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఈనేప‌థ్యంలో ఈ ఏడాది ఆక్టోబ‌రు 6 మ్యారేజ్ అయ్యాక కాస్త గ్యాప్ తీసుకొని.. ఇప్ప‌టికే ఒప్పుకున్న సినిమాల్ని పూర్తి చేయాల‌ని చైతూ భావిస్తున్నాడ‌ట‌. వ‌చ్చే ఏడాది ఎట్టి ప‌రిస్థితుల్లో స‌మంతో క‌లిసి త‌న కోలీవుడ్ ఎంట్రీని గ్రాండ్ గా ఉండేలా చూస్తున్న‌ట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/



Tags:    

Similar News