• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సినిమా ఏమైంది చైతూ

ఆ సినిమా ఏమైంది చైతూ

By - Tupaki Desk
Update: 2015-12-29 11:30 GMT
నెల క్రితం ‘మజ్ను’ షూటింగ్ మొదలుబెట్టాడు అక్కినేని నాగచైతన్య. యువ దర్శకుడు చందూ మొండేటి జెట్ స్పీడుతో సినిమా తీసేస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిపోయింది. రెండో షెడ్యూల్ కోసం రాజమండ్రికి వెళ్లింది యూనిట్. చైతూ స్పీడ్ చూస్తుంటే అతను డేట్లు పూర్తిగా ఈ సినిమాకే కేటాయించినట్లున్నాడు. దీనికి ముందు చేస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ షూటింగ్ విషయంలో అతడి పార్ట్ ఏమీ బ్యాలెన్స్ ఉన్నట్లుగా లేదు. ‘మజ్ను’ మొదలవడానికి ముందే ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయినట్లు చెబుతున్నారు. కానీ ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందన్నదే తేలడం లేదు.

డిసెంబర్లోనే ‘సాహసం శ్వాసగా సాగిపో’ను రిలీజ్ చేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ట్రైలర్ వచ్చి కూడా చాలా రోజులైంది. మరి ఆడియో సంగతేంటో.. రిలీజ్ మాటేంటో తెలియట్లేదు. ఈ సినిమాను తమిళంలో శింబుతో తీస్తున్నాడు గౌతమ్ మీనన్. చైతూ షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తి చేస్తే శింబు మాత్రం డుమ్మా కొట్టి తనను ఇబ్బంది పెట్టాడని ఓ కార్యక్రమంలో మొహమాటం లేకుండా చెప్పేశాడు గౌతమ్. పైగా ఈ మధ్య చెన్నై వరదలు వచ్చి పడ్డాయి. శింబు బీప్ సాంగ్ వివాదంలోనూ చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో తమిళ వెర్షన్ కు సంబంధించి వర్క్ బ్యాలెన్స్ ఉండొచ్చని.. రెంటినీ ఒకేసారి విడుదల చేయాలని కాబట్టి ఆలస్యం అవుతుండొచ్చని అంటున్నారు. జనవరిలో ఎలాగూ ఖాళీ ఉండదు కాబట్టి చైతూ-గౌతమ్ జంటకు అచ్చొచ్చిన ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తారేమో. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేసావె’ ఫిబ్రవరిలోనే విడుదలైంది.
Tags:    
  • Naga CHaitanya 
  • Sahasam Swasaga Sagipo Movie 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS