త‌మిళంలో చేస్తాన‌ని చైతూ అడిగాడ‌ట కానీ..

Update: 2016-11-09 01:30 GMT
త‌మిళ హీరోలు చాలామందికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కానీ మ‌న హీరోలే పొరుగు రాష్ట్రాల‌పై పెద్ద‌గా దృష్టిపెట్ట‌లేదు చాలా ఏళ్లు. ఇప్పుడిప్పుడే మ‌న హీరోల్లో మార్పు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా అంద‌రూ ద్విభాషా చిత్రాలు చేస్తున్నారు. ప్ర‌ధానంగా త‌మిళం మీద దృష్టిపెడుతున్నారు. అక్కినేని కుర్రాడు నాగ‌చైత‌న్య‌కు కూడా అలాంటి ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ట‌. అస‌లు ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’ సినిమాను త‌నే త‌మిళంలోనూ చేద్దామ‌నుకున్నాడ‌ట‌. కానీ ఆ ఆలోచ‌న ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ కు చెప్పేస‌రికి ఆల‌స్య‌మైపోయింద‌ట‌.

‘‘సాహ‌సం శ్వాసాగా సాగిపో సినిమాను నేనే త‌మిళంలో చేస్తే బాగుంటుంద‌నిపించింది. ఆ మాటే గౌత‌మ్ గారితో చెబితే ఇప్పటికే త‌మిళంలోనూ 20 రోజులకు పైగానే షూటింగ్ చేసేశాం క‌దా అన్నారు. అందుకే ఈ సినిమాను తెలుగుతోనే సరిపెట్టాను. తమిళ హీరోలంతా తెలుగులో డైరెక్ట్ సినిమాలు కూడా చేస్తున్నారు. మ‌న వాళ్లూ వేరే భాష‌ల్లో న‌టిస్తున్నారు. నేను కూడా త్వరలోనే ఒక ద్విభాషా చిత్రంలో నటించాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది క‌చ్చితంగా చేస్తాను’’ అని చైతూ చెప్పాడు.

ఇక ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’లో త‌న పాత్ర గురించి చైతూ చెబుతూ.. ‘‘ఇందులో నా పాత్ర‌కు ప్ర‌త్యేక‌మైన‌ క్యారెక్టరైజేషన్ అంటూ ఏమీ ఉండదు. మామూలు కుర్రాళ్ల లాగే క‌నిపిస్తాను. చ‌దువు పూర్తై ఉద్యోగం వెతుక్కునే కుర్రాడిగా.. చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తాను. ఆ పాత్ర జ‌ర్నీ కొత్తగా ఉంటుంది. నా పాత్రతో పాటే ప్రేక్షకుడు కూడా ప్రయాణం చేస్తాడు. ఆ క్యారెక్ట‌ర్ని గౌతమ్ మీనన్ భ‌లే డిజైన్ చేశారు’’ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News