సేతుపతి vs టబు.. పూరి మాస్ స్వాగ్ గట్టిగానే..
ఈ గ్లింప్స్ లో టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టబు క్యారెక్టర్ మూడ్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేశాయి.
దర్శకుడు పూరి జగన్నాథ్ క్యారెక్టర్లను చాలా బోల్డ్ గా డిజైన్ చేస్తుంటాడనే విషయం తెలిసిందే. కానీ ఈసారి ఏకంగా ఒక సీనియర్ నటికి ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ రాసుకున్నాడు. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్లమ్ డాగ్ లో టబు ఒక పవర్ ఫుల్ అవతార్ లో కనిపిస్తోంది. గౌరీ హెగ్డే అనే ఇన్కమ్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ గా టబు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. లేటెస్ట్ విడుదల చేసిన గ్లింప్స్ తో ఓ క్లారిటీ వచ్చేసింది.
అల.. వైకుంఠపురములో అమ్మగా కనిపించిన టబు మళ్ళీ పెద్దగా తెలుగులో కనిపించలేదు. క్యూట్ గా, కూల్ గా ఉండే పాత్రలు చేసిన టబు, ఇలా ఒక బస్తీలోకి ఎంటర్ అయి సిగరెట్ తాగుతూ మాస్ స్వాగ్ చూపించడం ఆడియన్స్ కి కొత్త కిక్ ఇస్తుంది. ఏయ్ మా బస్తీలోకి ఎందుకొచ్చావు అని ఒకడు అడిగితే.. నీ బాబుదా బస్తీ అంటూ గూండాలను చితక్కొట్టే సీన్ చూస్తుంటే ఈ పాత్రను ఎంత వయోలెంట్ గా డిజైన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఐటీ రైడ్స్ కే పరిమితం కాకుండా కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది.
పూరి జగన్నాథ్ డైలాగ్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ గ్లింప్స్ లో టబు చెప్పే డైలాగ్స్ కూడా అదే రేంజ్ లో పేలాయి. విజయ్ సేతుపతి లాంటి ఇంటెన్స్ యాక్టర్ ని కుర్చీలో కూర్చోబెట్టి, మెడ దగ్గర కర్ర పెట్టి బెదిరించే సీన్ సినిమాకే హైలైట్ అనిపిస్తోంది. "మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం, తర్వాత మాట్లాడతాం" అని టబు చెప్పే మాటలు ఈ పాత్ర యాటిట్యూడ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఈ ఇద్దరి మధ్య స్క్రీన్ మీద జరిగే వార్ మామూలుగా ఉండదని ఈ ఒక్క సీన్ తో చెప్పకనే చెప్పారు.
రెగ్యులర్ సినిమాల్లో లేడీ ఆఫీసర్స్ అంటే కేవలం ఫైల్స్ పట్టుకుని సీరియస్ లుక్స్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ రూల్స్ బ్రేక్ చేసి, చేతిలో కర్ర పట్టుకుని విలన్ గ్యాంగ్ తో నేరుగా ఫైట్ చేసే స్థాయికి క్యారెక్టర్ ని ఎలివేట్ చేశారు. విజయ్ సేతుపతి లాంటి స్ట్రాంగ్ విలన్ లేదా హీరోకి సరైన పోటీ ఇవ్వాలంటే ఆపోజిట్ రోల్ కూడా అంతే బలంగా ఉండాలి. ఆ స్పేస్ ని టబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో వంద శాతం ఫిల్ చేసేలా కనిపిస్తోంది.
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి, జెబి నారాయణ్ రావు భారీగా నిర్మిస్తున్నారు. ఈ గ్లింప్స్ లో టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టబు క్యారెక్టర్ మూడ్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేశాయి. బస్తీ వాతావరణాన్ని చాలా రియలిస్టిక్ గా, డార్క్ థీమ్ తో చూపించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.
చాలా గ్యాప్ తర్వాత తెలుగులో టబు ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తోంది. 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ స్లమ్ డాగ్ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక పక్క నటనతో మ్యాజిక్ చేసే విజయ్ సేతుపతి, మరో పక్క ఎప్పుడూ చూడని కొత్త కోణంలో టబు. ఈ ఇద్దరి కాంబో కచ్చితంగా థియేటర్లలో ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి పూరి కంటెంట్ ఎంత కొత్తగా ఉంటుందో చూడాలి.