నాని సినిమాల్లో ట్రెండింగ్ హీరోయిన్ల సెంటిమెంట్!
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న నేచురల్ స్టార్ నాని కథల ఎంపికలోనే కాకుండా హీరోయిన్ల సెలక్షన్‌లోనూ ప్రత్యేకమైన శైలిని పాటిస్తుంటారు.
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న నేచురల్ స్టార్ నాని కథల ఎంపికలోనే కాకుండా హీరోయిన్ల సెలక్షన్‌లోనూ ప్రత్యేకమైన శైలిని పాటిస్తుంటారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో జోడీల విషయంలో నిబంధనలు పెట్టుకోని నాని గడచిన కొన్ని సంవత్సరాలుగా మాత్రం పక్కా వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఆ సమయంలో ఏ హీరోయిన్ అయితే ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంటారో? ఎవరి క్రేజ్ పీక్స్‌లో ఉంటుందో? వారినే తన సినిమాల్లో ప్రధాన తారగా ఎంపిక చేయడం అలవాటుగా మార్చుకున్నారు.
ఈ సెంటిమెంట్ యాదృచ్ఛికం కాకుండా పకడ్బందీ మార్కెటింగ్ , సక్సెస్ ఫార్ములాగా మారుతుండటం విశేషం. ట్రెండింగ్‌లో ఉన్న నటీమణులతో జోడీ కట్టడం వల్ల సినిమాపై అప్పట్లోనే ఆటోమేటిక్‌గా హైప్ పెరుగుతుంది. కీర్తి సురేష్, సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి వంటి బ్యూటీస్ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్న తరుణంలోనే నాని వారిని తన సినిమాల్లోకి తీసుకొచ్చి విజయాలను అందుకున్నారు. ఈ ప్రణాళికాబద్ధమైన ఎంపికల వల్లే నాని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.
కీర్తి సురేష్‌తో `నేను లోకల్` చిత్రంలో జోడీ కట్టిన నాని ఆ తర్వాత `ఫిదా` సినిమాతో ఫుల్ ట్రెండ్‌లో ఉన్న సాయి పల్లవితో `ఎంసిఏ` సినిమా చేసి భారీ హిట్ కొట్టారు. అలాగే `సీతారామం`తో యూత్ హృదయాలను కొల్లగొట్టిన మృణాల్‌తో `హాయ్ నాన్న` వంటి క్లాసిక్ లవ్ స్టొరీని అందించారు. `ఉప్పెన`తో సంచలనం రేపిన కృతి శెట్టిని కూడా సరిగ్గా అదే క్రేజ్ సమయంలో తన చిత్రంలో భాగం చేసుకున్నారు. ఈ వరుస ఉదాహరణలన్నీ నాని హీరోయిన్ల ఎంపిక ఎంత పక్కాగా ఉంటుందో స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం ఇదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ నాని తాజా ప్రాజెక్ట్‌ల కోసం కూడా ట్రెండింగ్ బ్యూటీలనే తీసు కున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `పారడైస్` చిత్రంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారుతున్న కయాదు లోహర్ నటిస్తున్నారు. `డ్రాగన్` హిట్ తో వెలిగిపోతున్న సమ యంలో..అమ్మడి ప్యూచర్ ముందుగానే గుర్తించి ఈ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేయడం ఇండస్ట్రీలో చర్చనీ యాంశమైంది.
అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కబోయే `బ్లడీ రోమియో` సినిమా కోసం కూడా మరో ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు పరిశీలనలో బలంగా వినిపిస్తోంది. రీసెంట్ చిత్రాలతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ భామకు నాని సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కనుందని సమాచారం. ఆ రకంగా ప్రతి చిత్రానికి మార్కెట్‌లో ట్రెండ్‌లో ఉన్న నటీమణులను లాక్ చేయడం నాని సినిమాలకే ప్రత్యేక బలంగా మారుతోంది.
మొత్తంగా నాని అనుసరిస్తున్న ట్రెండింగ్ హీరోయిన్ల సెంటిమెంట్ ఆయన కెరీర్‌కు ఎంతో ప్లస్ అవుతోంది. హీరో ఇమేజ్‌తో పాటు హీరోయిన్ క్రేజ్ కూడా తోడవడంతో ఆ సినిమాలపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా నాని తన సినిమాల కోసం ఇలాంటి క్రేజీ కాంబినేషన్లనే సెట్ చేస్తూ.. బాక్సాఫీస్ వద్ద తన జోరును మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.