• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూ కెరీర్ బెస్ట్...

చైతూ కెరీర్ బెస్ట్ ఇస్తాడా?

By - Tupaki Desk
Update: 2018-10-16 05:28 GMT
ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `అర‌వింద స‌మేత‌` ఈ సీజ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అన్న చ‌ర్చ ట్రేడ్‌లో సాగుతోంది. ఈ ద‌స‌రా బ‌రిలో విశాల్ `పందెంకోడి 2` భారీ హైప్‌తో రిలీజ‌వుతోంది. ఈ సీక్వెల్ సినిమా విజ‌యంపై టీమ్ ధీమాను వ్య‌క్తం చేస్తోంది. రామ్ - దిల్ రాజు కాంబినేష‌న్ మూవీ `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే` ద‌స‌రా బ‌రిలోనే రిలీజ్‌కి వ‌స్తోంది. ఈ సినిమాపైనా మేక‌ర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ త‌ర్వాత వ‌స్తున్న సినిమాల్లో నాగ‌చైత‌న్య - చందు మొండేటి కాంబినేష‌న్ మూవీ `స‌వ్య‌సాచి` అంతే క్రేజీగా రిలీజ్ బ‌రిలోకొస్తోంది. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 2న‌ రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా చైతూ - చందు ఇద్ద‌రికీ ఎంతో ఇంపార్టెంట్.

`ప్రేమ‌మ్` చిత్రంతో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్న నాగ‌చైత‌న్య మ‌రోసారి ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయాల‌ని ఎంతో హార్డ్‌వ‌ర్క్‌ని చేశారు. అలానే కార్తికేయ‌ - ప్రేమ‌మ్ వంటి విభిన్న‌మైన చిత్రాలతో త‌న‌కు ద‌ర్శ‌కుడిగా వ‌చ్చిన పేరు నిల‌బెట్టుకునేందుకు చందు మొండేటి అంతే శ్ర‌మిస్తున్నారు. ఎంచుకున్న కాన్సెప్ట్ డిఫ‌రెంట్‌. పైగా ఏడాది కాలంగా దీనిపై యూనిట్ రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తోంది. భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్‌తోనూ మాయాజాలం ఉంటుంద‌ని చెబుతున్నారు. మాధ‌వ‌న్ - చైత‌న్య పోటాపోటీగా న‌టించారు. భూమిక పాత్ర అంతే ఇంప్రెస్సివ్‌గా ఉంటుంద‌న్న చ‌ర్చ ఇటీవ‌ల సాగింది. ఆ క్ర‌మంలోనే `స‌వ్య‌సాచి` పై అంచ‌నాలు రెట్టించాయి. స‌వ్య‌సాచి తెలుగు రాష్ట్రాలు స‌హా న‌వంబ‌ర్ 2 రిలీజ్ బ‌రిలోకి వ‌స్తోంది. న‌వంబ‌ర్ 1వ తేదీన‌ అమెరికా ప్రీమియర్స్‌కి భారీ స‌న్నాహ‌కాలు చేస్తున్నారు. బెంగ‌ళూరు, చెన్న‌య్, మ‌ధురై వంటి చోట్లా తెలుగు సినిమాల‌కు గిరాకీ పెరిగింది కాబ‌ట్టి ఆ మేర‌కు భారీ రిలీజ్‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.

`స‌వ్య‌సాచి` చిత్రం నాగ‌చైత‌న్య కెరీర్ బెస్ట్ అవుతుందా?  చందుమొండేటి స‌త్తా మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేస్తుందా? అన్న ఉత్కంఠ ప్ర‌స్తుతం నెల‌కొంది. `స‌వ్య‌సాచి` కాన్సెప్ట్ టాలీవుడ్‌కి కొత్త‌గా, యూనిక్‌గా ఉంటుందా? అన్న చ‌ర్చా అక్కినేని అభిమానుల్లో సాగుతోంది. చై-చందు కాంబినేష‌న్ మూవీ `ప్రేమ‌మ్` దాదాపు 15 కోట్లతో తెర‌కెక్కి, 25-30 కోట్ల మ‌ధ్య‌ వ‌సూలు చేసింది. అదే త‌ర‌హాలో పంపిణీదారుల్లో ఉత్సాహం నింపే ఫ‌లితాన్ని `స‌వ్య‌సాచి` ఇస్తుందా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నాగ‌ చైత‌న్య న‌టించిన `శైల‌జారెడ్డి అల్లుడు` విజ‌యం సాధించ‌డం `స‌వ్య‌సాచి`పై పాజిటివ్ బ‌జ్ పెంచుతోందని తెలుస్తోంది.
Tags:    
  • Naga Chaitanya 
  • Chandoo Mondeti 
  • SavyaSachi Movie 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS