సావిత్రి సినిమా.. సెన్సేషనా.. కాంట్రవర్సీయా?

Update: 2016-03-14 05:09 GMT
ఎవడే సుబ్రమణ్యం మూవీతో డైరెక్టర్ మారిన నాగ్ అశ్విన్.. ట్యాలెంటెడ్ దర్శకుడుగా గుర్తింపు పొందాడు. మహానటి సావిత్రి జీవితగాధపై సినిమా చేస్తానని గతంలోనే చెప్పిన నాగ్ అశ్విన్.. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించన అప్ డేట్స్ అన్నీ సమకూర్చుకుంటున్నాడు. కోట్లాది మంది అభిమానం పొందిన సావిత్రి.. చివరకు ఆర్ధిక ఇబ్బందులతో మరణించాల్సిన పరిస్థితి వరకూ చాలా రియల్ ఇన్సిడెంట్లకు సంబంధించిన తెర వెనుక జరిగిన వాటిని పోగు చేసుకున్నాడట నాగ్ అశ్విన్.

పెద్ద హీరోలు ఆమెకు ఆర్థిక సహాయం - ఆస్పత్రిలో చికిత్సకు కూడా డబ్బులు లేకపోవడం లాంటి వాటికి కారణాలు తెలుసుకున్నాడట ఈ డైరెక్టర్.  మొత్తం మీద సావిత్రి రియల్ లైఫ్ లో ఎవ్వరికీ తెలియని కొత్త పాయింట్స్‌ పట్టేశాడని తెలుస్తోంది. ఇంతకీ ఈయన రీసెర్చ్ చేయగలగడానికి మామగారైన అశ్వినీ దత్ కారణం అని సమాచారం. అప్పట్లో మద్రాస్‌ లో ఉండే అశ్వినీ దత్‌ కు సావిత్రి గురించి చాలా విషయాలు తెలుసు. దీంతో ఆయన్నుంచి కొన్ని వివరాలు, కాంటాక్ట్స్ తీసుకుని.. తనకు కావలసిన డేటా రాబట్టుకున్నాడని టాక్.

అశ్వినీదత్ కూడా అల్లుడి కోసం తను చేయగలిగిన సాయం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మహానటి సావిత్రి జీవితంలో జనాలకు తెలియని కోణాన్ని నాగ్ అశ్విన్ చూపించబోతున్నాడు. మరి ఈ సావిత్రి సినిమా... సెన్సేషన్స్ సృష్టిస్తుందో?  లేక కాంట్రవర్సీలకు కేంద్రం అవుతుందో?
Tags:    

Similar News