• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త ఏడాదిలో నభా నటేశ్...

కొత్త ఏడాదిలో నభా నటేశ్ హవా!

By - Tupaki Desk
Update: 2020-12-21 04:00 GMT
నభా నటేశ్ .. ఇప్పుడు మాస్ కుర్రాళ్లు ఈ పేరును ఒక మంత్రంలా జపిస్తున్నారు. హాట్ హాట్ గా అందాలవిందు చేసే ఈ అమ్మాయిని తెరపై చూడటానికి తపిస్తున్నారు. ముద్దుగా బొద్దుగా కనిపించే ఈ బ్యూటీ, 'నన్నుదోచుకుందువటే' సినిమాతో తెలుగు తెరపై మెరిసింది. తొలి సినిమాలో ఈ అమ్మాయిని చూసినవారు, తన గ్లామర్ కి కాస్తంత మసాలా జోడిస్తే దుమ్మురేపేయడం ఖాయమని అనుకున్నారు. ఆ తరువాత ఈ సుందరి చేసిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా అదే విషయాన్ని నిజం చేసింది.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఈ అమ్మాయి చేసిన అందాల సందడి అంతా ఇంతా కాదు. బంతిపువ్వులాంటి ఈ భామ పెంచిన గ్లామర్ డోస్ కి యువకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ సినిమాలోని పాటల్లో ఈ బ్యూటీ అందాలు ఒలకబోస్తుంటే, కుర్రాళ్ల కళ్లు అక్వేరియంలో చేపపిల్లల్లా కొట్టుకున్నాయి. అంతలా ఈ అమ్మాయి ఊరించింది .. ఊహల వెంట ఉరికించింది .. ఉత్సాహాన్ని పెంచింది. యూత్ లో నభా క్రేజ్ రాకెట్ లా దూకుపోయింది. దాంతో అవకాశాలు బాగానే పలకరిస్తున్నాయి.

నభా తాజా చిత్రంగా రూపొందిన 'సోలో బ్రతుకే సో బెటర్' ఈ నెల 25వ తేదీన థియేటర్స్ కి రానుంది. సాయిధరమ్ తేజ్ హీరోగా నిర్మితమైన ఈ సినిమాలో ఈ చిన్నది మరింత గ్లామరస్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. 'సోలో బ్రతుకే సో బెటర్' అనుకున్న ఓ కుర్రాడిని ముగ్గులోకి దింపాలంటే మామూలు గ్లామర్ ఉంటే పనవుతుందా మరి! ఆ రేంజ్ లోనే నభా తన గ్లామర్ ను జాడించి .. ఆరేసిందనే అంటున్నారు. ఈ సినిమాతో తన క్రేజ్ మరింత పెరుగుతుందని స్ట్రాంగ్ గా చెబుతుందంటే, ఆమె జోరు ఏరులై పొంగిందనే అనుకోవాలి.

ఈ సినిమా తరువాత నభా నటేశ్ చేతిలో 'అల్లుడు అదుర్స్' .. 'అంధాదున్' తెలుగు రీమేక్ ఉన్నాయి. లాక్ డౌన్ తరువాత ఈ అమ్మాయిని కలుస్తున్న దర్శక నిర్మాతల సంఖ్య ఎక్కువగానే ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగానే వినిపిస్తోంది. అందాలు ఒలకబోయడానికి ఈ సుందరి ఎంతమాత్రం వెనకాడకపోవడంతో, యువ దర్శకులు ముందుగా ఆమె పేరునే పరిశీలిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇదే ఊపు కొనసాగితే వచ్చే ఏడాదిలో నభా హవా కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.
Tags:    
  • Solo Brathuke So Better 
  • Sai Dharam Tej 
  • Release 
  • Theatres 
  • December 25th 
  • Nabha Natesh 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS