గమ్యం సెంటిమెంట్‌ తో రాబోతున్న ‘నాంది’

Update: 2020-07-27 10:50 GMT
అల్లరి నరేష్‌ కెరీర్‌ ఆరంభంలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు దక్కించుకున్నాడు. నరేష్‌ సినిమాకు ఖచ్చితంగా పైసా వసూళ్‌ అన్నట్లుగా ఉండేది. కాని కాల క్రమేనా పరిస్థితి మారిపోయింది. అల్లరి నరేష్‌ ఏడాదిలో మూడు నాలుగు సినిమాల నుండి ఒకటి రెండుకు పడి పోయాడు. గత రెండేళ్లుగా నరేష్‌ సినిమాలే కరువయ్యాయి. మహర్షి చిత్రంలో కీలక పాత్రలో నటించిన నరేష్‌ హీరోగా ‘నాంది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అవుతున్న సమయంలో కరోనా కారణంగా ఆగిపోయింది. కరోనా సమయంలోనే సినిమా టీజర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పటి వరకు నవ్వించిన అల్లరి నరేష్‌ ఈ చిత్రంలో మాత్రం ఏడిపిస్తాడని ఫస్ట్‌ లుక్‌ మరియు టీజర్‌ తో అర్థం అవుతోంది. గతంలో గమ్యం సినిమాలో నరేష్‌ పాత్ర చాలా బాగా ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమాలో నరేష్‌ పాత్ర చనిపోతుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ ను ఈ చిత్రంలో కూడా ఫాలో అవ్వబోతున్నారట.

తెలుగు ప్రేక్షకులకు యాంటీ క్లైమాక్స్‌ అస్సలు నచ్చదు. అయినా కూడా ఈ చిత్రం కథ డిమాండ్‌ మేరకు అల్లరి నరేష్‌ పాత్రను చంపేస్తున్నారట. ఈమద్య వచ్చిన కొన్ని సినిమాలకు యాంటీ క్లైమాక్స్‌ ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులు ఆధరించారు. కనుక ఈ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు గమ్యం సెంటిమెంట్‌ వర్తించి సక్సెస్‌ అవుతుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అల్లరోడికి హిట్‌ చాలా అవసరం. మరి ఈ చిత్రం ఆ హిట్‌ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News