మిల్కీ బ్యూటి తేలిపోయిందిగా..

Update: 2018-05-09 05:26 GMT
ఇంతవరకు మాస్ సినిమాలు.. యాక్షన్ ఎంటర్ టెయినర్లు చేసుకుంటూ వచ్చిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ రూటు మార్చాడు. కెరీర్ లో కొత్తగా ట్రయ్ చేస్తూ ఈసారి రొమాంటిక్ మూవీ నా నువ్వే చేస్తున్నాడు. కొత్త దర్శకుడు జయేంద్ర డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో థియేటర్లకు రానుంది. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచే ఈ మూవీపై ప్రేక్షకుల్లో బజ్ క్రియేటయింది.

ఈ సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ ప్రమోషనల్ టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. హీరోయిన్ తమన్నా తన మనసులో మాటను పాట రూపంలో ఆలపిస్తుంటే.. కళ్యాణ్ రామ్ వెనుక కీబోర్డు ప్లే చేస్తూ కనిపించాడు. మెలోడియస్ గా ఉన్న ఈ పాట సింప్లీ సూపర్బని చెప్పాలి. మ్యూజిక్ - సింగర్ - బ్లాక్ అండ్ వైట్ లో పిక్చరైజేషన్ ఇలా అన్నీ చాలాచాలా బాగున్నాయి. ఎటొచ్చీ హీరోయిన్ తమన్నానే కాస్త తేడాగా అనిపించింది. మూడ్ ను ఎలివేట్ చేయాల్సిన క్లోజప్ సీన్స్ లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగా డ్రమెటిక్ గా అనిపించాయి.  కాస్తంత బాధ.. ఆవేదన నిండిన రొమాంటిక్ మూడ్ లో ఈ పాట ఉంటే తమన్నా ఫేస్ లో అలాంటి ఫీలింగే కనిపించదు.

లేటెస్ట్ గా వచ్చిన హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్.. అదితిరావ్ హైదరీ వంటి వాళ్లు క్లోజఫ్ షాట్స్ లో కట్టిపడేస్తున్నారు. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సీన్లలో వాళ్ల కళ్లలో కనిపించే ప్రేమ ఫీలింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వాళ్లతో పోలిస్తే బాగా సీనియర్ అయిన తమన్నా ఈ విషయంలో తేలిపోవడం కాస్తంత ఆశ్చర్యమే. సినిమాలో అయినా ఆ ఫీల్ ఆమె ముఖంలో కనిపిస్తుందా.. లేక ఎప్పటిలాగే రొటీన్ డ్రమటిక్ ఎక్స్ ప్రెషన్ తో సరిపెట్టేసిందో వెండితెరపైనే చూడాలి.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News