గాడ్సే వ్యాఖ్యలపై నాగబాబు మరో హాట్ కామెంట్స్!
ఈ విపత్కర టైంలో ఖాళీగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. నిన్నటికి నిన్న మహాత్మ గాంధీని చంపిన ‘నాథురాం గాడ్సేను’ పొగుడుతూ నాగబాబు చేసిన ట్వీట్స్ వివాదాస్పదమైంది. నాగబాబును రాజకీయ పార్టీలు, నేతలు, నెటిజన్లు సైతం తప్పుపట్టారు. ఇదీ మెగా ఫ్యామిలీ వరకు వెళ్లింది. చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ను, జనసేన పార్టీకి కూడా ఆపాదించి విమర్శల జడివాన కురిపించారు.
మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలే గాడ్సేపై ట్వీట్ చేస్తూ.. ‘ఈరోజు నాథూరాం గాడ్సే పుట్టినరోజు అని.. నిజమైన దేశభక్తుడని.. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది పక్కనపెడితే గాడ్సే వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా చెప్పలేదని.. అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసిందని.. ఇప్పుడు అప్పుడూ మీడియా అదే చేస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘గాంధీని చంపితే తాను విలన్ అవుతానని తెలిసినా చంపాడని.. అతడి దేశభక్తిని శంకించలేమని.. పుట్టినరోజున గాడ్సేను గుర్తు చేసుకోవాలనిపించిందని.. పాపం నాథూరాం గాడ్సే రెస్ట్ ఇన్ పీస్’’ అంటూ నాగబాబు మరో ట్వీట్ లో గాడ్సేపై సానుభూతి కురిపించారు. ఈ వ్యాఖ్యలు తెలుగునాట తీవ్ర దుమారం రేపాయి. మహాత్ముడిని చంపిన గాడ్సేను పొగడడం పెనుదుమారాన్ని సృష్టించింది.
దీంతో నాగబాబు మరోసారి వివరణ ఇచ్చారు. గాడ్సేను పొగడడం పై క్లారిటీ ఇచ్చారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో స్పందించాడు.. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి.. నేను నాథూరాం గాడ్సే చేసిన నేరాన్ని సమర్థించలేదని.. గాడ్సే వెర్షన్ కూడా జనానికి తెలియాలని మాత్రమే ట్వీట్ చేశానని.. నాకు మహాత్మాగాంధీ అంటే చాలా గౌరవం..’ అని తన వ్యాఖ్యలను దిద్దుబాటు చేసుకున్నారు.
అంతేకాదు మరో ట్వీట్లో తాను గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిగతమని.. జనసేన పార్టీకి గానీ, మా కుటుంబంలో మరెవరికీ నా అభిప్రాయలతో సంబంధం లేదని’ నాగబాబు వివరణ ఇచ్చాడు.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పలువురు హిందుత్వ వాదులు, గాంధీ అభిమానులు నాగబాబుపై కేసులు పెట్టారు. ఇది మెగాబ్రదర్ ను చిక్కుల్లో పడేసింది. అందరి నుంచి వ్యతిరేకత పెల్లుబుకడంతో ఎట్టకేలకు గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. మహాత్మాగాంధీ అంటే తనకు అమిత గౌరవం అని చల్లార్చే ప్రయత్నం చేశారు. ఇప్పట్లో ఈ వివాదం సద్దుమణిగిలే కనిపించడం లేదు. ఇలాంటి సున్నితమైన భావోద్వేగ అంశాల్లో అనవసరంగా వ్యాఖ్యానించి నాగబాబు చిక్కుల్లో పడ్డారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.