నా అందం అలా ఉంది.. నన్నేం చేయమంటారుః ఇలియానా
ఇలియానా అంటే అందం.. అందం అంటే ఇలియానా అన్నట్టుగా ఉండేది టాలీవుడ్లో. ఈ నడుము సుందరి జమానా అలా సాగిపోయింది. తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిందీ అమ్మడు. అయితే.. ఇటీవల ఇలియానా బాడీ షేప్ పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు. తాజాగా.. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఫైర్ అయ్యిందీ గోవా బ్యూటీ.
తనలో బ్యూటీ స్పాట్స్ కూడా ఉన్నాయని, వాటిని కాకుండా లోపాలను మాత్రమే ఎత్తిచూపడం సరికాదని చెబుతోంది. అంతేకాదు.. తన బాడీ పార్ట్స్ లో కొన్ని భాగాలు తనకు కూడా నచ్చవని చెప్పడం విశేషం. ఎదభాగంతోపాటు చేతులు సన్నగా ఉంటాయని, ముక్కు, పెదాలు కూడా సరిగా ఉండవని చెప్పింది ఇలియానా.
అంతేకాకుండా.. తాను చూడ్డానికి అంత పొడవుగా కనిపించనని, నల్లగా కూడా ఉంటానని చెప్పుకొచ్చిందీ భామ. ఈ విషయాలను తనను వేధిస్తుంటాయని చెప్పడం ద్వారా.. తనలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను బయట పెట్టింది గోవా సుందరి. ఎవరైనా తన బాడీ సైజ్ గురించి చెప్పమంటే ఇబ్బంది పడతానని కూడా చెప్పింది.