బాలయ్య సరసన ముస్కాన్
నందమూరి బాలకృష్ణ చాన్నాళ్ల తర్వాత ఓ కొత్త కథానాయికతో నటించబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమాలో ఒక హీరోయిన్ కొత్తమ్మాయే అని కన్ఫమ్ అయింది. ఆ హీరోయిన్ పేరేంటో కూడా పూరి చెప్పాడు. ముస్కాన్.. బాలయ్య-పూరి సినిమాలో లీడ్ హీరోయిన్ గా చేయబోయే అమ్మాయి పేరిది. బాలయ్య సరసన ఇంకో కథానాయిక కూడా నటిస్తుందని పూరి తెలిపాడు. ఆ హీరోయిన్ కొత్తమ్మాయా కాదా అన్నది ఇంకా డిసైడవ్వలేదన్నాడు పూరి. ఈ చిత్రంలో సన్నీ లియోన్ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు కూడా వాస్తవమేనన్నాడు పూరి.
ఇక బాలయ్యతో సినిమా అనుభవం.. ఆయన పాత్ర గురించి పూరి చెబుతూ.. ‘‘బాలయ్య గారిని గ్యాంగ్ స్టర్ గా కొత్త లుక్ తో చూపించబోతున్నా. ఇప్పటివరకూ కనిపించిన దానికి పూర్తి భిన్నంగా ఆయన కనిపిస్తారు. హైదరాబాద్ తో పాటు కొంతవరకు విదేశాల్లో షూట్ చేస్తాం. తొలి షెడ్యూల్ చేశాం. ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్ తీశాం. ఇందులో డైలాగుల దగ్గర్నుంచి అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. బాలకృష్ణ గారితో పని చేయడం ఒకలా ఉంటుందని నేననుకున్నా. కానీ నాకు పూర్తి భిన్నమైన అనుభవం ఎదురైంది. ఆయన పంక్చువాలిటీ.. ఎనర్జీ చూస్తే మతి పోతుంది. ఉదయం ఆరున్నరకే సెట్లోకి వచ్చి కూర్చుంటారు. ఏడు గంటలకు తొలి షాట్ తీసేస్తాం. ఈ రోజుల్లో ఎవరైనా అలా వస్తారా? కొత్తగా వచ్చిన హీరోలు.. చిన్న స్థాయి హీరోలు కూడా అలా ఉండరు. ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ ఆయనకు వచ్చిందనుకుంటా’’ అని పూరి అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/