థమన్ ఈసారి మహేశ్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచే ప్రసక్తే లేదు..!
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు ఎస్ఎస్ థమన్. సాంగ్స్ తో పాటుగా బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొడుతున్న తమన్.. చేతినిండా సినిమాలతో ఫుల్ ఫార్మ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ - స్టార్ హీరోల సినిమాలన్నీ థమన్ వద్దకే వస్తున్నాయి కానీ.. అతని కెరీర్ ను టాప్ లీగ్ లోకి తీసుకొచ్చింది మాత్రం మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ 'దూకుడు' అనే చెప్పాలి.
2009లో 'మళ్లీ మళ్లీ' అనే సినిమాతో మ్యూజిక్ కంపోజర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తమన్.. 'కిక్' చిత్రంతో ఫస్ట్ మేజర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు కానీ.. అతనికి టర్నింగ్ పాయింట్ మాత్రం 'దూకుడు' సినిమానే. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే మహేష్ బాబు సంగీత దర్శకుడి వర్క్ మెచ్చి, వెంటనే 'బిజినెస్ మ్యాన్' సినిమాకి అవకాశం ఇచ్చారు. ఇది కూడా చార్ట్ బస్టర్ గా నికిచింది.
అయితే మహేష్ - థమన్ కలయికలో వచ్చిన మూడో సినిమా 'ఆగడు' మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆగడు టైటిల్ సాంగ్ ను మహేశ్ చిత్రాల్లో బెస్ట్ గా పరిగణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మహేష్ నటించిన ''సర్కారు వారి పాట'' సినిమాకి మ్యూజిక్ అందించే ఛాన్స్ అందుకున్నాడు థమన్.
మహేష్ - కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సర్కారు వారి పాట'. ఇటీవలే విడుదలై ఈ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. థమన్ సంగీతం ఆశించిన విధంగా లేదనే కామెంట్స్ వచ్చాయి. 'కళావతి' సాంగ్ మినహా మిగతా పాటలన్నీ యావరేజ్ అనిపించుకున్నాయి.
'అల వైకుంఠపురములో' స్థాయిలో పాటలు.. 'అఖండ' రేంజ్ లో బీజీఎమ్ ఎక్సపెక్ట్ చేసిన ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. థమన్ సోషల్ మీడియాలో ఇచ్చిన హై కి.. ఆల్బమ్ కు అసలు సంబంధం లేదని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు మరోసారి మహేష్ బాబు సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ - పూజా హెగ్డే జంటగా SSMB28 సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హసినీ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చనున్నారు. డైరెక్టర్ - మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి.
థమన్ ఈసారి నిరాశ పరచకూడదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే సమయంలో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఖాయమని ధీమాగా ఉన్నారు. దీనికి కారణం దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించడమే. గతంలో వీరి కలయికలో 'అరవింద సమేత వీర రాఘవ' 'అల వైకుంఠపురములో' వంటి ఆల్బమ్స్ వచ్చాయి. 'భీమ్లా నాయక్' మ్యూజిక్ కూడా త్రివిక్రమ్ దగ్గరనుండి చూసుకున్నారు.
ఇప్పుడు SSMB28 సినిమాకు మంచి ఆల్బమ్ ఇస్తారని ఆశించవచ్చు. మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అతడు' 'ఖలేజా' రేంజ్ లో థమన్ సంగీతం అందించి.. తన గురువు మణిశర్మ ను మరిపిస్తారో లేదో చూడాలి.