వైరల్ వీడియో: కికి ఛాలెంజ్ మరో కోణం!

Update: 2018-07-31 12:14 GMT
'కికి ఛాలెంజ్'.. ఈమధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న పదం. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటంటే.. " మూవింగ్ కారునుంచి దిగి బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతున్న ఇన్ మై ఫీలింగ్స్ పాటకు డ్యాన్స్ చేసి మళ్ళీ కార్ ఎక్కాలి'.  ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ ని స్వీకరించారు. కొంతమంది ఆగి ఉన్న కారు నుండి దిగి డాన్స్ చేశారు గానీ మెజారిటీ మాత్రం కదులుతున్న కారు నుండి దిగి ఈ విన్యాసం చేసిన వారే.  రీసెంట్ గా టాలీవుడ్ బ్యూటీ రెజినా కూడా ఈ ఫీట్ చేసింది.

మరో వైపు ఈ వీడియోలపై, కికి ఛాలెంజ్ పై విమర్శలు రోజురొజుకి ఎక్కువ అవుతున్నాయి.  సెలబ్రిటీలను అభిమానులు గుడ్డిగా ఫాలో అవుతారని, ఇలా కదిలే కారునుండి దిగి చేసే విన్యాసాల వల్ల ప్రమాదాల పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సెలబ్రిటీలు ఇలాంటి ఛాలెంజిలకు దూరంగా ఉంటే మంచిదని అంటున్నారు.  సమాజానికి ఎవైనా ఉపయోగపడేవి చెయ్యాలి గానీ తమను, తమతో పాటు ఇతరులను ప్రమాదాల పాలు చేసే అవకాశం ఉన్న ఇలాంటి ఛాలెంజ్ లు స్వీకరించవద్దని అంటున్నారు.  ఇప్పటికే ముంబై పోలీసులు - కర్ణాటక పోలీసులు కికి ఛాలెంజ్ లాంటి వాటి జోలికి పోవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కికి ఛాలెంజ్ ట్రెండ్ మెల్లగా ఊపందుకుంటోంది.
Read more!

కికి ఛాలెంజ్ ను స్వీకరించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది యాక్సిడెంట్ల పాలయ్యారు.  రీసెంట్ గా ఈ కికి ఛాలెంజ్ చేస్తూ.. కికి  డూ యు లవ్ మీ అంటూ ఓ యువకుడు కారునుండి దిగి - డాన్స్ చేస్తూ ఓ పోల్ కి గట్టిగా ఢీకొట్టడంతో గాయలయ్యాయి.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View


Tags:    

Similar News