అమ్మాయిగా మారిన మేల్ డిజైన‌ర్ పై బాలీవుడ్ ప్రేమ‌!!

Update: 2021-01-07 10:30 GMT
ఆధునిక స‌మాజంలో హిజ్రా(ట్రాన్స్ జండ‌ర్) ల క‌ష్ట‌న‌ష్టాలు.. ‌క‌ల‌త‌లు అన్నివేళ‌లా హాట్ టాపిక్. స‌మాజం వెలివేసే త‌త్వానికి వ్య‌తిరేకంగా కోర్టులు తీర్పులిచ్చినా అవేవీ ఇంకా చాలామందికి ప‌ట్ట‌వు. లోపాన్ని వెతికి కించ‌ప‌ర‌చ‌డం అనే దుష్ఠ‌త్వాన్ని ఇంకా వీడ‌లేదు మాన‌వ స‌మాజం.

కానీ బాలీవుడ్ స‌హా ఫేజ్ 3 ప్ర‌పంచంలో ఈ త‌ర‌హా హిజ్రాల‌కు అవ‌మానాలున్నా చాలామంది ప్ర‌ముఖ సెలబ్రిటీల నుంచి గౌర‌వం ద‌క్కుతుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌కుండా ఉండ‌దు. ప్ర‌ముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్వాప్నిల్ షిండే తాను ట్రాన్స్ వుమన్ ని అని ప్ర‌క‌టిస్తూ త‌న ఒరిజిన‌ల్ రూపాన్ని ఆవిష్క‌రించారు. ``నా పేరు సైషా .. నేను అమ్మాయిగా మారాను!`` అంటూ ధైర్యంగా ప్ర‌క‌టించుకున్నారు. తాను హిజ్రాను కాబోన‌ని అన్నారు. దీనిపై బాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు కురుస్తు‌న్నాయి. అంద‌రి నుంచి ప్రేమ భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఫ్యాషన్ డిజైనర్ స్వాప్నిల్ షిండే బాలీవుడ్ అగ్ర తార‌లంద‌రికీ ప‌ర్స‌న‌ల్ డిజైన‌ర్ గా కొన‌సాగుతున్నారు. ఆమెగా మారిన అత‌డికి ఎంతో గొప్ప ప్ర‌తిభ గుర్తింపు ఉంది. స్టార్ హీరోయిన్ల‌లో దీపికా పదుకొనే- సన్నీ లియోన్ - కరీనా కపూర్ ఖాన్ - మందిరా బేడి - మాధురి వంటి ప్ర‌ముఖ తార‌ల‌కు స్టైలింగ్ చేసిన డిజైన‌ర్ గా త‌న‌కు ఎంతో గౌర‌వం ఉంది.

సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా తన పేరును స్వాప్నిల్ నుండి సైషా షిండే గా మార్చుకున్నాన‌ని ప్ర‌క‌టించ‌డ‌మే గాక‌..సైషా తన కొత్త రూపంలో ఒక చిత్రాన్ని షేర్ చేశారు. ఆ ఫోటోకి ``ఇదిగో మ‌నం 2021 # సైషా `` అన్న వ్యాఖ్య‌ను జోడించారు.

ఆమెగా మారాక‌ తన రూపాన్ని రివీల్ చేస్తూ తనను తాను ట్రాన్స్ వుమన్ అని ప్ర‌క‌టించ‌గానే .. చాలా మంది సెలబ్రిటీలు కామెంట్ల‌ విభాగంలో త‌మ ప్రేమ‌ను కురిపించారు. సాటి డిజైనర్ కెన్ ఫెర్న్స్ కూడా `పవిత్రమైన‌ అద్భుతం` అంటూ ఆనందం వ్య‌క్తం చేసారు. సన్నీ లియోన్ డిజైనర్ ‌కు తన శుభాకాంక్షలు తెలిపారు. అదితీ రావు హైదారి.. అమృతా ఖాన్విల్కర్ .. శిల్పా శిరోద్కర్.. లోపాముద్ర రౌత్ సహా ఇతర ప్రముఖులు కూడా డిజైనర్ ఇలా స్వ‌యంగా ఓపెన్ అయినందుకు ప్రశంస‌లు కురిపించారు.

ఈ స‌త్యాన్ని అంగీక‌రించే ముందు.. లైంగిక‌త‌ కారణంగా ఎన్నోసార్లు వేధింపుల‌కు గుర‌య్యాన‌ని తెలిపారు. ఆమె ఎదుర్కొన్న వేధింపుల గురించి సుదీర్ఘ నోట్ లో చాలా విష‌యాల్ని వివ‌రించారు. తన బాల్యం ఒంటరితనం .. ఆమె మూలాల‌ కారణంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాన‌ని తెలిపారు సైషా. లేని రియాలిటీతో జీవించాల్సిన ప‌రిస్థితిని త‌లుచుకుని ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు‌. ``నేను స్వలింగ సంపర్కుడిని అయినందున నేను పురుషుల పట్ల ఆకర్షితుడయ్యానని .. కానీ ఆరేళ్ల క్రితం మాత్రమే `నేను` చివరకు `నన్ను` అంగీకరించాన‌ని.. సైషా తెలిపారు. ``ఈ రోజు నేను మీకు తెలియ‌జేస్తున్నాను. నేను స్వలింగ సంపర్కుడిని కాదు. నేను ట్రాన్స్ వుమన్ మాత్ర‌మే`` అని ఓపెన‌య్యారు. ఆమె తనను తాను సైషా అని పేరు పెట్టడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ ఒక శీర్షిక రాసారు. సైషా అంటే ``అర్ధవంతమైన జీవితం`` అని పేర్కొన్నారు. మ‌ధుర్ భండార్కర్ ఫ్యాషన్ (2008) కి దుస్తులను డిజైన్ చేసి పాపుల‌రైన సైషా అలియాస్ షిండే ఇటీవలే `బుర్జ్ ఖలీఫా..` (లక్ష్మీ లో సాంగ్) పాట‌కు కియారా అద్వానీ రూపాన్ని డిజైన్ చేశారు. ఆ పాట ఎంత‌గా వైర‌ల్ అయిందో తెలిసిన‌దే.
Tags:    

Similar News