మ‌ల్టీప్లెక్సు స్క్రీన్లు అద్దెకు.. ముందుకొచ్చేదెవ‌రు?

Update: 2020-10-21 04:15 GMT
వ‌ర‌ల్డ్ వైడ్ గా థియేట‌ర్స్ ఇప్పుడిప్పుడే రీఓపెన్ అవుతున్నాయి. మ‌న దేశంలో ఏడు నెల‌ల విరామం త‌రువాత ఈ నెల 15 నుంచి థియేట‌ర్ల‌ని ఓపెన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం అన్ లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా థియేట‌ర్ల పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా అనుమ‌తులు ఇచ్చినా థియేట‌ర్ల‌కు రావ‌డానికి జ‌నం ధైర్యం చేయ‌డం లేదు. దీంతో కొన్ని థియేట‌ర్లు ఇప్ప‌టికీ తెరుచుకోలేదు.

50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చ‌ని కేంద్రం దీనితో పాటు కొన్ని నిబంధ‌న‌లు పెట్టింది. దీంతో మ‌ల్టీప్లెక్స్ లు త‌ప్ప సింగిల్ స్క్రీన్ లు తెర‌వ‌డానికి ఎగ్జిబిట‌ర్స్ ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఇక మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లోనూ చాలా వ‌ర‌కు ఓపెన్ చేయ‌ని ప‌రిస్థితి. కొంత మంది మాత్ర‌మే ఓపెన్ చేసి పాత చిత్రాల్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కేంద్రం చెప్పిన 50 శాతం ఆక్యుపెన్సీ కూడా వుండ‌ని ప‌రిస్థితి. దీంతో మెయింటెనెన్స్ భారంగా మారుతోంది.

ఈ విష‌యాన్ని గ్ర‌హించిన ఐనాక్స్ న్యూ థాట్ తో ముందుకొచ్చింది. జ‌నాల‌కే స్క్రీన్లను అద్దెకు ఇవ్వాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఒక్కో స్క్రీన్ ని బుక్ చేసుకుని ప్రైవేట్‌గా స్క్రీనింగ్ చేసుకునేలా అవ‌కాశం క‌ల్పిస్తోంది. కోరిన సినిమాలు కొత్త‌వి... పాత‌వి ప్ర‌ద‌ర్శించుకోవ‌చ్చు. అలాగే బ‌ర్త్ డే పార్టీలు..మూవీ ఈవెంట్స్ ..వ‌ర్క్ షాప్ లు ఇలా అన్ని ర‌కాల ఫంక్ష‌న్స్ ల‌కు వాడుకునేలా వెసులుబాటు క‌ల్పిస్తోంది. అయితే ఐడియా బాగానే వున్నా భారీ మొత్తం చెల్లించి స్క్రీన్ ల‌ని అద్దెకు తీసుకునేది ఎవ‌రు? ఇది ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంది అన్న‌దే ఇప్ప‌డు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News