కుందనపు బొమ్మయినా కనికరిస్తుందా?

Update: 2015-09-01 07:06 GMT
ముళ్లపూడి వెంకటరమణ కుమారుడు వర ముళ్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాఅల్లుడు చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అయినా... తండ్రిస్థాయి కళాత్మక దృశ్యాలను చూపించడంలో ఫెయిలయ్యాడనే విమర్శలు మూటకట్టుకున్నాడు. తర్వాత మూడేళ్లకు మళ్లీ విశాఖ ఎక్స్ ప్రెస్ అంటూ ఇంకో చిత్రాన్ని తీసినా ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు.

దాదాపు ఏడేళ్ల గ్యాప్ తీసుకుని.. పల్లెటూరి ప్రేకకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వర.  చాందినీ చౌదరి, సుధాకర్ కొమాకులో ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకధీర రాజమౌళిలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు ముళ్లపూడి వర. వీరు చేసిన సాయంతోనే ఇప్పుడు ఇండస్ట్రీలో నిలబడగలినన్న వర... కుందనపు బొమ్మ స్క్రిప్ట్ సిద్ధం చేసేందుకు ఏడాదిన్నరకి పైగా కష్టపడ్డానన్నాడు.

వరపై రాజమౌళి ప్రశంసలు కురింపించాడు రాఘవేంద్రరావు దగ్గర తాను పని చేసినపుడు... ముళ్లపూడి వర దగ్గర టెక్నిక్స్ నేర్చుకోవాలని సూచించారని... అప్పటివరకూ ఆయన ముళ్లపూడి వెంకటరమణ కొడుకు అని తనకు తెలీదన్న జక్కన్న.. ఆరోజునుంచి మంచి ఫ్రెండ్స్ అయిపోయానన్నాడు. 43 కథలు రిజెక్ట్ చేశాక... రాఘవేంద్రరావు ఓకే చేసిన 44వ స్టోరీ ఇది అని డైరెక్టర్ చెప్పడం విశేషం.
Tags:    

Similar News