మహేష్ కి తండ్రే విలన్

Update: 2015-08-01 10:35 GMT
ఒక్కడు సినిమాలో మహేష్ పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన సన్నివేశంలో ప్రకాష్ రాజ్ 'మీ వాడి గురించి టెన్షన్ పడతాండవా?' అన్నందుకు.. బదులుగా ముకేష్ రిషి 'టెన్షన్ మా వాడి గురించి కాదు.. నీ గురించి' అని వార్నింగ్ ఇచ్చాడు. తండ్రి పాత్రలో మహేష్ కి అండగా నిలిచిన ముకేష్ రిషి ఇప్పుడు అదే మహేష్ తో తలపడనున్నాడు.

శ్రీమంతుడు సినిమాలో విలన్ గా నటించింది ముఖేష్ రిషినే. సీన్ రివర్స్ అయిందిక్కడ. అదే మరి విశేషం. పాత్రకి సరిపడా సత్తా వున్న నటులు లేకో.. లేదా దర్శకుడికి సదరు నటుడిపై అభిమానమో తెలీదు గాని విలన్ లే తండ్రులుగానూ చేస్తున్నారు. ఆ నటులు కూడా కాస్త వైవిధ్యమైన పాత్ర దొరికిందని సంతోషపడుతున్నారు. ముకేష్ రిషి మహేష్ విషయంలోనే కాదు ఎన్టీఆర్ తోనూ అదే బాటలో వెళ్లారు. బృందావనం, బాద్షాలో లో ఎన్టీఆర్ తండ్రిగా నటించిన ముకేష్ జి రామయ్య వస్తావయ్య సినిమాలో విలన్ గా మారిపోయారు. అదీ సంగతి.. మహేష్ తండ్రే విలన్ అనేసరికి కృష్ణ గారు అనుకున్నారా ఏంటి.. రామ.. రామ..!           
Tags:    

Similar News