• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధోని ట్రైలర్ ప్రకంపనలు...

ధోని ట్రైలర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయ్

By - Tupaki Desk
Update: 2016-09-08 19:30 GMT
ఫాలోయింగ్ విషయంలో సినిమా తారలు ధోని ముందు దిగదుడుపే అనడానికి అతడి జీవిత కథతో తెరకెక్కుతున్న ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ విషయంలో జనాల్లో ఉన్న ఆసక్తే రుజువు. ధోని కథలో కొత్తేముంటుంది.. అతడి స్టోరీతో సినిమా అంటే జనాలు ఏమంత ఆసక్తి చూపిస్తార్లే అని తేలిగ్గా తీసిపడేసిన వాళ్లకు దీని ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్సే సమాధానంగా నిలిచింది. టీజర్.. ట్రైలర్ రికార్డులంటే అందరికీ సల్మాన్ ఖానో.. అమీర్ ఖానో.. షారుఖ్ ఖానో గుర్తుకొస్తాడు. ఐతే వాళ్ల సినిమాల ట్రైలర్ల రికార్డుల్ని అలవోకగా దాటేసింది ‘ధోని’ ట్రైలర్. సుల్తాన్ ట్రైలర్ ఒక్క రోజులో అత్యధికంగా 33 లక్షల వ్యూస్ తెచ్చుకుంటే ‘ధోని’ ట్రైలర్ కు ఏకంగా 52 లక్షల హిట్స్ పడ్డాయి. ఇండియాలో అత్యంత వేగంగా కోటి మార్కును అందుకున్న ట్రైలర్ గానూ ఇది రికార్డు సృష్టించింది.

తాజాగా ఇండియాలో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న ట్రైలర్ గానూ ‘ధోని’ రికార్డు సాధించింది. ఈ ట్రైలర్ కు 3.5 లక్షల లైక్స్ వచ్చాయి. ‘కబాలి’కి ఇంతకంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి కానీ.. అది టీజర్ రికార్డు. ట్రైలర్ వరకు ‘ధోని’దే రికార్డన్నమాట. ‘ధోని’ హిందీ ట్రైలర్ కు మాత్రమే 1.93 కోట్ల హిట్స్ వచ్చాయి. తెలుగు.. తమిళం ట్రైలర్లు కూడా కలుపుకుంటే లెక్క 2.18 కోట్ల దాకా ఉంది. ఇండియాలో ఈ మార్కును అందుకున్న ట్రైలర్లు చాలా తక్కువ. ఇక ఈ సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజిలో జరుగుతోంది. ఆల్రెడీ శాటిలైట్ రైట్స్ ద్వారానే రూ.60 కోట్లు వచ్చి పడ్డాయి. బిజినెస్ మొత్తంగా రూ.300 కోట్లకు చేరుకున్నట్లు చెబుతున్నారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 30న విడుదలవుతుంది.
Tags:    
  • M.S.Dhoni The Untold Story 
  • MS Dhoni Movie Official Trailer 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS