రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా...?
సినీ ఇండస్ట్రీ గత నాలుగు నెలలుగా మూతబడి ఉంది. షూటింగ్స్ ఆగిపోయాయి.. థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. సినిమా రిలీజులు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో షూటింగులకు అనుమతులు లభించాయి. అయినప్పటికీ ఇంతవరకు పెద్ద సినిమాలు ఏవీ చిత్రీకరణ స్టార్ట్ చేయలేదు. నిజానికి షూటింగులకు అనుమతి రావడంతో అర్థాంతరంగా ఆగిపోయిన సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేయాలని భావించారు. అయితే కరోనా రోజురోజుకి విజృభిస్తుండటంతో ఎవరూ రిస్క్ తీసుకొని షూటింగ్ ప్రారంభించడానికి ముందుకు రాలేదు. దీంతో టాలీవుడ్ లో సినిమాల షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే దాని మీద స్పష్టత రాలేదు.
ఇప్పటి వరకు సెప్టెంబర్ నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయని అందరూ అనుకున్నారు. ఇప్పుడు కరోనా తీవ్రత పెరుగుతుండటంతో కొన్ని ఏరియాల్లో లాక్ డౌన్ విధిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కరోనాతో కొంతకాలం సహజీవనం చేయాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ వచ్చే దాకా షూటింగ్ లో పాల్గొనలేమని కొంతమంది నటీనటులు చెప్పేస్తున్నారట. స్టార్ హీరోలైతే ఇప్పట్లో షూటింగ్ విషయంలో రిస్క్ తీసుకోకపోవడమే మంచిందని చెప్తున్నారట. ఇప్పటికే ఈ ఏడాది సగం గడిచిపోయింది. ఈ మహమ్మారి వలన మరో ఆరు నెలల సమయం కూడా వృధాగా పోయే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే ఇప్పటికే 80 శాతం పైన షూటింగ్ జరుపుకొని.. 10 నుండి 15 రోజుల్లో కంప్లీట్ అయ్యే చిత్రాలు మాత్రం రిస్క్ తీసుకొని అక్టోబర్ లో సెట్స్ పై వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ప్యాచ్ వర్క్ మిగిలి ఉన్న కొన్ని చిన్న సినిమాలు చిత్రీకరణ స్టార్ట్ చేసాయి. ఇక పెద్ద సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది చివర్లో లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో రెగ్యులర్ షూట్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటికి కూడా కరోనా తీవ్రత ఇలానే కొనసాగితే మాత్రం దీనిపై ఇప్పట్లో క్లారిటీ రాదనే చెప్పవచ్చు. ఇక థియేటర్స్ రీ ఓపెనింగ్ విషయంపై కూడా స్పష్టత లేదు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు థియేటర్స్ లో బొమ్మ పడకపోవచ్చని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారట. దీనిని బట్టి చూస్తే 2020 మొత్తం కరోనా తోనే గడిచిపోనుందని తెలుస్తోంది.