విక్టోరియా సీక్రెట్ తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్ త్రిప్తి డిమ్రీ
ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ `విక్టోరియా సీక్రెట్` భారతీయ మార్కెట్లోకి తన ముద్రను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.;
ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ (సీకే) బ్రాండ్ కి ప్రమోటర్ గా దిశా పటానీ ప్రకంపనల్ని మర్చిపోక ముందే ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్ విక్టోరియా సీక్రెట్స్ లోదుస్తుల బ్రాండ్ కి ట్రిప్తి దిమ్రీ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఇది ట్రిప్తీకి గేమ్ ఛేంజర్ కాబోతోందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ `విక్టోరియా సీక్రెట్` భారతీయ మార్కెట్లోకి తన ముద్రను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటిగా త్రిప్తి సరికొత్త చరిత్ర సృష్టించింది. `యానిమల్` సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు గ్లోబల్ ఫ్యాషన్ రంగంలో భారతీయ ప్రతిభను చాటుతోంది.
ఈ అద్భుతమైన ప్రయాణం గురించి త్రిప్తి డిమ్రీ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. అందులో విక్టోరియా సీక్రెట్‌కు చెందిన స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌లో ఆమె ఎంతో కాన్ఫిడెంట్‌గా, గ్లామరస్‌గా కనిపించింది. ఆత్మవిశ్వాసం, సాధికారత, వైవిధ్యానికి ప్రతిరూపమైన విక్టోరియా సీక్రెట్ కుటుంబంలో భాగం కావడం ఎంతో గర్వంగా ఉంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ సహకారం కేవలం ఫ్యాషన్‌కే పరిమితం కాకుండా.. భారతీయ మహిళల వ్యక్తిత్వాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించేలా ఉంది.
విక్టోరియా సీక్రెట్ వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్ ఒక భారతీయ ముఖాన్ని ఎంచుకోవడం వెనుక బలమైన వ్యూహం కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ బ్రాండ్ కేవలం పరిమిత అందాల పోటీల ప్రమాణాల నుండి బయటకు వచ్చి బాడీ పాజిటివిటీ, విభిన్న సంస్కృతులకు ప్రాధాన్యత ఇస్తోంది. త్రిప్తి డిమ్రీ తన సహజసిద్ధమైన నటనతో గ్లామర్‌తో యువతలో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తన ఎంపిక ద్వారా భారతీయ వినియోగదారులకు మరింత దగ్గరవ్వాలని ఆ సంస్థ భావిస్తోంది.
త్రిప్తి డిమ్రీ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ సహా సౌత్ చిత్ర పరిశ్రమలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన స్పిరిట్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లోను ఓ చిత్రంలో నటిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న త్రిప్తి ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్‌తో జతకట్టడం ఆమె మార్కెట్ వాల్యూను ఒక్కసారిగా పెంచేసింది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఫ్యాషన్ - లైఫ్‌స్టైల్ విభాగాల్లోనూ ట్రిప్తి ఒక ఐకాన్‌గా ఎదుగుతోంది. ఈ క్రేజీ అప్‌డేట్ చూసిన అభిమానులు సోషల్ మీడియాల్లో అభినందనలతో ముంచెత్తుతున్నారు.
భారతీయ నటీమణులు ప్రపంచ ఫ్యాషన్ వేదికలపై తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న తీరు ఆకట్టుకుంటోంది. గతంలో ప్రియాంక చోప్రా వంటి అగ్ర కథానాయిక ఈ బ్రాండ్‌తో అనుబంధం కొనసాగించింది. కానీ ఇప్పుడు ఏకంగా బ్రాండ్ అంబాసిడర్‌గా అధికారికంగా నియమితులైన తొలి నటి త్రిప్తి కావడం విశేషం. విక్టోరియా సీక్రెట్- త్రిప్తి డిమ్రీల ఈ కలయిక భవిష్యత్తులో మరిన్ని వినూత్నమైన ఫ్యాషన్ ట్రెండ్స్‌కు నాంది పలకబోతోంది.