రాజా వారి బ్రాండ్ అంతగా దెబ్బ తిందా?
ఆయనో నైజాం కింగ్. మార్కెట్ ని అల్లాడిస్తారు. ఎగ్జిబిషన్.. పంపిణీ.. సినిమాల నిర్మాణం ఇలా ప్రతిదీ ఆయనకు బాగానే కలిసొచ్చాయి. అగ్ర హీరోలతో ఆయనకు ఉన్న చెలిమి కలిసొచ్చింది. అయితే ఎన్ని ఉంటేనేం.. గత రెండేళ్లుగా ఆయన అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా బ్రాండ్ వ్యాల్యూ పడిపోతోంది. ఇటీవల ఏది పట్టినా అది మట్టిగా మారుతోంది. గోల్డెన్ హ్యాండ్ కాస్తా ఐరన్ లెగ్ అన్న ముద్రకు అంకితమైపోయే పరిస్థితి కనిపిస్తోందన్న గుసగుసా వినిపిస్తోంది.
ఇలాంటి సన్నివేశంలోనే మాయదారి కరోనా మహమ్మారీ దాపురించి ఉన్న కొద్దిపాటి ఆశలపైనా పూర్తిగా నీళ్లు చల్లేసింది. 2019లో ఒకలా అయితే 2020లో ఇంకోలా అయ్యింది సీను. గత ఏడాది నష్టాన్ని 2020లో పూడ్చాలనుకుంటే అనుకున్నదొకటి అయినదొకటి. ఈ ఏడాది కూడా కలిసి రాలేదు.. 2020 బ్యాడ్ ఇయర్ గా మారిపోయింది! ఎందుకంటే సంక్రాంతి సీజన్ లో విడుదలైన భారీ స్టార్ స్టడ్ సినిమా ప్రచారం సాగినంతగా వసూళ్లు తేలేకపోయింది. సమర్పకుడిగా ఉండడం కలిసి రాలేదు. పెట్టిన పెట్టుబడికి వచ్చిన రిటర్న్స్ కు ఏ మాత్రం పొంతన లేదు.
ఆ తరువాత వచ్చిన యువహీరో సినిమా కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు ఓటీటీలో ఎన్నో హోప్స్ తో రిలీజ్ చేసిన తాజా మూవీ కూడా అంతంత మాత్రమేనని టాక్. ఓటిటికి ఇచ్చేయడం కారణంగా కొంత లాభం పడినప్పటికీ మార్కెట్లో బ్రాండ్ వ్యాల్యూ అయితే దారుణంగా పడిపోయింది. ఇక ఈ మహమ్మారీ క్రైసిస్ లోనే సదరు నిర్మాత కం ఎగ్జిబిటర్ కి మరో షాకింగ్ ట్విస్ట్ ఎదురైందిట. లీజ్ తీసుకున్న చాలా థియేటర్స్ ఎగ్రీమెంట్స్ కూడా ఈ ఏడాదితో పూర్తి అయిపోతున్నట్లుగా సమాచారం. ఇలా అయితే కోలుకోవడం అంత ఈజీ కాదన్న విశ్లేషణ సాగుతోంది. గోరు చుట్టుపై రోకటిపోటు అంటే ఇదేనేమో!