• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దుబాయ్ ప్రియుడిని...

దుబాయ్ ప్రియుడిని పెళ్లాడేసిన టీవీ మూవీ న‌టి

By - Tupaki Desk
Update: 2022-01-28 03:30 GMT
బాలీవుడ్ నటి మౌని రాయ్ త‌న ప్రియుడు సూరజ్ నంబియార్ ను కేరళ సంప్రదాయ ప‌ద్ధ‌తిలో అలాగే  బెంగాలీ సాంప్ర‌దాయంలోనూ వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో సూరజ్ నంబియార్ ఎంతో మురిసిపోగా వ‌ధువు మెరుపులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

నేటి ఉదయం గోవాలో కేరళ సంప్రదాయంలో ఈ జంట‌ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. ``నేను అతనిని ఎట్టకేలకు కనుగొన్నాను. మీ ప్రేమ ఆశీస్సులు కావాలి… `` అంటూ మౌని ఎమోష‌న‌ల్ కాగా.. సూరజ్ మాట్లాడుతూ..నా ప్రాణ స్నేహితురాలిని నా జీవితంలోని ప్రేమను పెళ్లి చేసుకున్నాను.  అత్యంత అదృష్టవంతుడిగా భావిస్తున్నాను .. అంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ఈ జంట‌కు బాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి ఆశీస్సులు అందాయి. అనుష్క శర్మ- స్మృతి ఇరానీ ఇంకా పలువురు సినీ టెలివిజన్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మౌనిరాయ్ అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న గోల్డ్ చిత్రంతో బాలీవుడ్ లో ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత సౌత్ లో కేజీఎఫ్ లాంటి క్రేజీ చిత్రంలో ఐట‌మ్ నంబ‌ర్ లో మెరిసింది. తెలుగులో ఈ భామ రంగ ప్ర‌వేశం చేయ‌నుంద‌ని ప్ర‌చార‌మైనా కానీ అవ‌కాశాలేవీ రాలేదు.

దుబాయ్ ప్రియుడితో చెట్టాప‌ట్టాల్!

జనవరి 27న  మౌని రాయ్  దుబాయ్ కి చెందిన ప్రియుడు సూరజ్ నంబియార్ తో ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత‌ వివాహం జ‌రుగుతుంద‌ని క‌న్ఫామ్ చేసింది ఈ జంట‌.  ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జనవరి 26న ప్రారంభమయ్యాయి. మౌని రాయ్ సినిమాల విష‌యానికి వ‌స్తే  `బ్ర‌హ్మ‌స్త్ర‌` లో న‌టిస్తోంది.
Tags:    
  • Mouni Roy 
  • Mouni Roy movies 
  • Mouni Roy photoshoot 
  • Mouni Roy photos 
  • Mouni Roy images 

Similar News

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS