ఫోటో స్టొరీ: ప్రకృతి కాంతలా మారిపోయిందే

Update: 2019-05-06 06:30 GMT
అందం అనేది బయట ఉంటుందా.. లేదా చూసేవారి కళ్ళలో ఉంటుందా.. లేదా ఆ అందమైన చిత్రాల సమాచారాన్ని ప్రాసెస్ చేసే మెదడులో ఉంటుందా? ఏమో ఎవరికి తెలుసు? ఒకటి మాత్రం నిజం.. అన్ని పరస్పర ఆధారితాలు. అందమైన అందాల బొమ్మ లేకపోతే మన కళ్ళు చూడలేవు.  కళ్ళ ముందు అందాల బొమ్మ ఉండి కూడా బ్రెయిన్ పని చేయకపోతే కళ్ళ ముందు ఉండేది అందంగా కనిపించే ఛాన్స్ లేదు.  అసలే సోమవారం.. ఇలాంటి హాట్ ఫిలాసఫీలు ఎందుకు కానీ మౌనీ రాయ్ ఇచ్చిన అందమైన పోజుల గురించి మాట్లాడుకుందాం.

మౌని రాయ్ ఒక బాలీవుడ్ బ్యూటీ.  క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ జమానా నుండి పోయినేడాది కలర్స్ ఛానల్ లో వచ్చిన 'నాగిన్ 3' టీవీ సీరీస్ వరకూ ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించింది. ఇక రియాలిటి షోస్.. డ్యాన్స్ ప్రోగ్రాములకైతే లెక్కే లేదు. బుల్లితెరతో పాటుగా వెండితెర పై కూడా ఈ భామ తన సత్తా చాటుతోంది.  కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన మౌని తర్వాత అక్షయ్ కుమార్ సినిమా 'గోల్డ్' లో హీరోయిన్ గా నటించింది. ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'మొగల్'.. 'బ్రహ్మాస్త్ర' సినిమాల్లో నటిస్తోంది.  ఇంట్రో లెంగ్త్ ఎక్కువైంది కదా? కొన్ని సార్లు అంతే. అలా జరుగుతుంది.  ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.. రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులను థ్రిల్ చేయడంలో నేర్పరి.
Read more!

తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు 'హియర్'(ఇక్కడ) అని క్యాప్షన్ ఇచ్చింది.  ఆరెంజ్ కలర్ లో లైట్ గ్రీన్ కలర్ డిజైన్ ఉండే ఒక గౌన్ ధరించి పచ్చటి గడ్డి ఉన్న నేలపై సుకుమారంగా పడుకుంది.  పూల చెట్టు కింద విశ్రమించడం కాబట్టి చుట్టుపక్కల కొన్ని పూలు కూడా పడి ఉన్నాయి. కానీ మౌని రాయ్ అలా ఊరుకోలేదు. తన చెవిపై ఒక పువ్వు.. జడలో మరో రెండు పూలను పెట్టుకుంది. ప్రకృతిలో ఉండే అందమంతా మౌని రాయ్ దగ్గరే కనిపిస్తున్నప్పటికీ తను కూడా ప్రకృతిని తనివితీరా ఆస్వాదిస్తున్నట్టుగా ఒక మంచి పోజిచ్చింది. కళ్ళు మూసుకున్న ఆ ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే పాప ఇక్కడ లేదు.. ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలోని అత్యంత ఎత్తైన శిఖరందాకా వెళ్ళిపోయినట్టుంది. మరి ఏ గ్రీకు వీరుడి గురించి కల కంటూ ఉందో ఏంటో!

ఈ ఫోటోకు నెటిజనుల స్పందన మామూలుగా లేదు.. 'ప్రెట్టి గర్ల్' అని ఒకరు.. 'సుందర్ అతి సుందర్' అని మరొకరు మెచ్చుకున్నారు. ఇంకొకరు 'టూ బ్యూటిఫుల్ టు హ్యాండిల్' అన్నారు. ఒకరు స్పానిష్ లో 'ఎరిస్ బోనితా' అన్నారు.  అంటే.. యు ఆర్ బ్యూటిఫుల్ అని ఇంగ్లీష్ లో అర్థం.


Tags:    

Similar News