హాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ భారతీయ తారలు
అనాదిగా హాలీవుడ్ తో భారతీయ నటీనటులకు ఉన్న అనుబంధం గురించి ఇక్కడివారికి తెలిసింది తక్కువే. దశాబ్ధాలుగా మనవాళ్లు పాశ్చాత్య దేశాల సినిమాల్లో టీవీ వెబ్ సిరీస్ లలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నా భారతీయ ఆరిజన్ లో పెద్దగా తెలియని వారున్నారు.
హాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ భారతీయ తారల పేర్లు పరిశీలిస్తే తొలిగా గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తుంది. ఇండియాతో పాటు హాలీవుడ్ లో సమానంగా ప్రాచుర్యం పొందిన స్టార్ గా పీసీ కి వీరాభిమానులున్నారు. భారతీయ సంతతికి చెందిన నటుల జాబితాలో ది జంగిల్ బుక్ లో మోగ్లీకి ప్రధాన పాత్ర పోషించిన నీల్ సేథి పేరు మార్మోగింది. డెడ్ పూల్ నుండి ఇండియన్ క్యాబీ డోపిందర్ గానూ అతడు కనిపించారు.
ప్రియాంక చోప్రా ఇప్పటివరకు బాలీవుడ్ తారలెవరూ అందుకోలేని స్థానాన్ని అందుకుంది. పీసీ అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో లో నటించిన తర్వాత అంతర్జాతీయ బిల్ బోర్డ్ జాబితాని శాసించింది. పీసీ ప్రతిష్ఠాత్మక పీపుల్స్ ఛాయిస్ అవార్డులను సొంతం చేసుకుంది. పీసీ అనేక అంతర్జాతీయ పత్రికల కవర్ పేజీలను అలంకరించడంతో పాటు క్వాంటికో రెండవ సీజన్ లో కనిపించింది. ప్రస్తుతం మ్యాట్రిక్స్ 4 మూవీ సహా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
న్యూయార్క్ నుండి వచ్చిన భారతీయ మూలాలున్న బాలకుడు నీల్ సేథి. ది జంగిల్ బుక్ నటుడిగా సుపరిచితం. బిల్ ముర్రే- బెన్ కింగ్స్లీ- ఇడ్రిస్ ఎల్బా- లుపిటా న్యోంగో- స్కార్లెట్ జోహన్సన్ -క్రిస్టోఫర్ వాల్కెన్ స్వరాలు అందించిన జంగిల్ బుక్ చిత్రంలో నీల్.. మోగ్లీ పాత్రలో నటించారు. ఈ పదేళ్ల వయస్సు పాత్ర కోసం ఆడిషన్ చేసిన వేలాది మంది పిల్లల నుండి అతడిని ఫైనల్ చేశారు. ప్రస్తుతం అతడు పశ్చిమంలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
డెడ్ పూల్ లో భారతీయ సంతతికి చెందిన టాక్సీ డ్రైవర్ కరణ్ సోని అకా డోపిందర్ పాత్ర ఆసక్తిని కలిగిస్తుంది. హిట్ టీవీ సిరీస్ `హీరోస్` లో జన్యు శాస్త్రవేత్త మొహిందర్ సురేష్ పాత్రకు అంతర్జాతీయ టెలివిజన్ లో బాగా ప్రాచుర్యం పొందిన ముఖాల్లో సెంధిల్ రామమూర్తి ఒకరు. యుఎస్ లో పుట్టి పెరిగిన పొడగరి అందగాడు సెంధిల్ కన్నడిగ .. కోవర్ట్ ఎఫైర్స్ అనే మరో టీవీ సిరీస్ లో విల్ కాక్స్ పాత్ర పోషించినందుకు ఆయన చాలా పాపులరయ్యారు.
దేవ్ పటేల్- ఫ్రీదా పింటో జంట స్లమ్‌డాగ్ మిలియనీర్ తో పాపులరయ్యారు. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది ఈ చిత్రం. నటీనటులు హాలీవుడ్ లో పెద్ద పేరు తెచ్చుకున్నారు. ఫ్రీడా ఆ తర్వాత అనేక చిత్రాలలో నటించింది. ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ లోనూ కథానాయిక. వివిధ అంతర్జాతీయ అవార్డులు ఈవెంట్లలో ఆమె అద్భుతమైన రెడ్ కార్పెట్ ప్రదర్శనల కారణంగా బాగా వెలుగులోకి వచ్చింది.
దిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ నుండి గ్రాడ్యుయేట్ అయిన సూరజ్ శర్మ ఆస్కార్ చిత్రం `లైఫ్ ఆఫ్ పై`లో ప్రధాన పాత్ర పోషించాడు. ఇర్ఫాన్ ఖాన్ - టబులు తన తల్లిదండ్రులుగా కనిపించారు. ఈ చిత్రం నాలుగు అకాడమీ అవార్డులను పొందగా ఈ దిల్లీ కుర్రవాడు బాఫ్టా రైజింగ్ స్టార్ అవార్డుకు ఎంపికయ్యాడు. దర్శకుడు ఆంగ్ లీ అమాయకంగా కనిపించే పైని సూరజ్ లో చూశాడు. యువ భారతీయుడు రింకు సింగ్ హాలీవుడ్ లో `మిలియన్ డాలర్ ఆర్మ్` తో పాపులరయ్యాడు. ఇది మాత్రమే కాదు.. అతను ప్రముఖ టీవీ సిరీస్ హోంల్యాండ్ లో అయాన్ ఇబ్రహీం పాత్ర పోషించాడు. అతను ఏదో ఒక రోజు హాలీవుడ్ టాప్ నటుడిగా ఎదిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నెవర్ హ్యావ్ ఐ ఎవర్ లో మైత్రేయి రామకృష్ణన్ నటించారు. నెట్ ఫ్లిక్స్ ఫిల్మ్ `ద నెదర్ ఫీల్డ్ గాళ్స్ లోనూ అవకాశం దక్కించుకున్నారు. అమెరికన్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ `రెడ్ నోటీస్`లో నటించిన రీతూఆర్య కూడా ఇండియన్ నటి. బ్రిటీష్ టీవీ సిరీస్ `డాక్టర్స్`తో ఆమె పాపులర్. `హ్యూమన్స్` ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది. ద అంబరిల్లా అకాడెమీ రెండో సీజన్ రీతూఆర్యకు ఎంతో పేరు తెచ్చింది.
జెరాల్డీన్ విశ్వనాథన్ `బ్యాడ్ ఎడ్యుకేషన్`లో జర్నలిస్టుగా నటించారు. తనకు `బ్లాకర్స్` తొలి గుర్తింపు తీసుకొచ్చింది. పీసీ నిర్మించిన `ఈవిల్ ఐ`లో సునీతా మణి భారతీయ మూలాలు ఉన్న నటే. అందులో నటించిన సరితా చౌదరి భారతీయురాలు. మిస్టర్ రోబోట్ - కామెడీ వెబ్ సిరీస్ ‘గ్లో’ సునీత కు పేరు తెచ్చాయి. మీరా- రాయల్ డిటెక్టివ్ టీవీ సిరీస్ లో నటిస్తున్నారు. అమెరికన్ టీవీ సిరీస్ `గ్రాండ్ ఆర్మీ`లో నటించిన ఆష్లీ గేంగర్... బ్రిటీష్ టీవీ సిరీస్ `వండర్ లిస్ట్ `తో నటిగా ప్రయాణం ప్రారంభించిన అన్యా ఛలోట్రా భారతీయురాలు. ఇర్ఫాన్‌ఖాన్- ఓం పురి - కథానాయికలు ఐశ్వర్యారాయ్ బచ్చన్- దీపికాపదుకోన్ హాలీవుడ్ చిత్రాల్లో నటించారు.