• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్పీడ్ పెంచిన 'మోస్ట్...

స్పీడ్ పెంచిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. ట్రైలర్ ఎప్పుడంటే..?

By - Tupaki Desk
Update: 2021-09-28 15:30 GMT
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. ఇందులో అఖిల్ సరసన పుజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేకర్స్.. ట్రైలర్ ను విడుదల చేయడానికి రెడీ అయ్యారు.

''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' థియేట్రికల్ ట్రైలర్ ను సెప్టెంబర్ 30న సాయంత్రం గం. 6.10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందులో నడిరోడ్డు మీద అఖిల్ నిలబడి ఉండగా.. పూజా భయంతో అఖిల్ ను గట్టిగా హగ్ చేసుకొని ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ - టీజర్ - సాంగ్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. 'మనసా మనసా' 'గుచ్చే గులాబీ' 'ఏ జిందగీ' 'లెహరాయి' పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

ఈ క్రమంలో సెప్టెంబర్ 30న రాబోతున్న ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' ట్రైలర్ ఎలా ఉండబోతుందో అని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ మంచి సక్సెస్ అందుకుంటారని ధీమాగా ఉన్నారు.  ఈ చిత్రంలో ఆమని - ఈషా రెబ్బా - చిన్మయి - వెన్నెల కిషోర్ - మురళీశర్మ - జయప్రకాష్ - ప్రగతి - అమిత్ తివారి - సుడిగాలి సుధీర్ - గెటప్ శ్రీను - అభయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీసుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు.
Tags:    
  • Akhil Akkineni 
  • Most Eligible Bachelor 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS