#RRR మీడియా సమావేశంపై బ్యాచిలర్ దృష్టి
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మొన్నటి వరకు కూడా అక్టోబర్ లోనే విడుదల ఉంటుందని అంతా అనుకున్నారు. కాని కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో థియేటర్లు రన్ అవ్వడం లేదు. దానికి తోడు జనాలు కూడా థియేటర్లకు రావడం లేదు. కనుక అక్టోబర్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది అనే ఉద్దేశ్యంతో జక్కన్న తన సినిమా విడుదల తేదీని మార్చబోతున్నాడు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలోనే చిత్ర దర్శకుడు రాజమౌళి మరియు యూనిట్ సభ్యులు మీడియా ముందుకు రాబోతున్నారు. సినిమా షూటింగ్ ముగిసింది అంటూ ప్రకటించడంతో పాటు విడుదల తేదీని మార్చుతున్నట్లుగా కూడా ప్రకటించే అవకాశం ఉంది అంటూ గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు చెబుతున్నారు. షూటింగ్ ముగింపుకు సంబంధించిన ప్రెస్ మీట్ ను జక్కన్న ఎప్పుడెప్పుడు ప్రకటించబోతున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీని మార్చితే దసరా సందర్బంగా వచ్చేందుకు పలు సినిమాలు సిద్దంగా ఉన్నాయి.
ముఖ్యంగా బాలయ్య నటించిన అఖండ సినిమాను దసరా బరిలో నిలిపేందుకు గాను ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. మరో వైపు అక్కినేని ప్రిన్స్ అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను కూడా దసరా బరిలో నిలిపేందుకు గాను ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రెస్ మీట్ కోసం మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. అఖిల్ బ్యాచిలర్ సినిమా విడుదల గత ఏడాది నుండి వాయిదాలు పడుతూ వచ్చింది. దసరా సీజన్ కు ఈ సినిమా విడుదల అవ్వకుంటే వచ్చే ఏడాది వరకు వాయిదా పడాల్సి ఉంటుంది. కనుక ఆర్ ఆర్ ఆర్ సినిమా డేట్ ను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అఖండ సినిమా తో పాటు ఆచార్య ను కూడా దసరాకు విడుదల చేస్తారనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. కనుక దసరా బరిలో బ్యాచిలర్ దిగితే ఎలా ఉంటుంది అనేది చర్చనీయాంశం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను జీఏ 2 బ్యానర్ లో నిర్మించాడు.