• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాజల్ పెళ్లి సందర్భంగా...

కాజల్ పెళ్లి సందర్భంగా 'మోసగాళ్లు' టీమ్ స్పెషల్ విషెస్..!

By - Tupaki Desk
Update: 2020-10-30 17:00 GMT
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ''మోసగాళ్లు''. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ లపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మోస‌గాళ్లు' చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. స్టార్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో విష్ణు సోదరి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. నేడు కాజల్‌ అగర్వాల్‌ వివాహం ముంబైకి చెందిన యువ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో జరగనుంది. ఈ సందర్భంగా 'మోసగాళ్లు' టీమ్ చందమామ కాజల్ అగర్వాల్‌ కు విషెస్ తెలియజేస్తూ న్యూ పోస్టర్ విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో వైట్ కలర్ మోడ్రన్ డ్రెస్ ధరించిన కాజల్ ఠీవీగా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. 'మోసగాళ్లు' చిత్రాన్ని ప్రపంచంలో అతి పెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు - ఇంగ్లీష్‌ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ ని భారీ బడ్జెట్ తో అత్యున్నతమైన సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రుహీ సింగ్ - న‌వ‌దీప్ - నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తుండటం విశేషం. ఈ సినిమా స్టోరీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెంకీ వివరిస్తారని తెలుస్తోంది.
Tags:    
  • Mosagallu 
  • Manchu Vishnu 
  • Kajal Aggarwal 
  • Wedding 
  • Poster 

Similar News

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

Copyright @2026

Powered by Blink CMS