ఫోటో స్టోరి: ఖ‌త‌ర్నాక్ బ్యూటీ

Update: 2019-02-13 01:30 GMT
క‌త్తి లాంటి రూపం మెయింటెయిన్ చేయ‌డం అంటే ఆషామాషీనా? అందుకోసం జిమ్ముల్లో రెగ్యుల‌ర్ గా క‌స‌ర‌త్తులు చేయాలి. నిరంత‌రం టైమ్ మెయింటెయిన్ చేస్తూ పొందిగ్గా ఆహార నియ‌మాలు పాటించాలి. యోగ‌, ధ్యానం వంటివి త‌ప్ప‌నిస‌రి. అలాంటి వ‌న్నీ మెయింటెయిన్ చేస్తారు కాబ‌ట్టే సెల‌బ్రిటీల లుక్ ఆ రేంజులో ఉంటుంది. శిల్పాశెట్టి, శ్రీ‌య వంటి సీనియ‌ర్ భామ‌లు ఫిజిక్ మెయింటెయిన్ చేయ‌డంలో ఎంద‌రికో స్ఫూర్తి.

ప్ర‌స్తుతం సీనియ‌ర్ల‌ను ఫాలో చేయ‌డంలో న‌వ‌త‌రం ట్యాలెంటు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఫ‌క్తు నియ‌మ‌నిష్ఠ‌ల‌తో ఉంటున్నారు. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న టీవీ న‌టి కం ఐటెమ్ గాళ్ మౌనీరాయ్ లుక్ ప్ర‌స్తుతం యువ‌త‌రంలో సీరియ‌స్ గా చ‌ర్చ‌కొచ్చింది. తీరైన రూపాన్ని మెయింటెయిన్ చేస్తూ బుల్లితెర వీక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేసిన ఈ అమ్మ‌డు వెండితెర‌పైనా వెలుగులు విర‌జిమ్మేందుకు ఓ రేంజులో మెయింటెయిన్ చేస్తోంది. నాగిని సీరియ‌ల్ తో బాగా ఫేమ‌స్ అయిన మౌని తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితం. ఆ క్ర‌మంలోనే టాలీవుడ్ లోనూ న‌టించేందుకు మౌనీ ఉవ్విళ్లూరుతోందిట‌.

రీసెంట్ గానే య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `కేజీఎఫ్ - ఛాప్ట‌ర్ 1`లో అదిరిపోయే ఐటెమ్ నంబ‌ర్ తో మెరుపులు మెరిపించింది. ఆ ఒక్క ఐటెమ్ తో మౌని స్థాయి ఏంటో తెలిసొచ్చింది. ఇక పూర్తి స్థాయి క‌థానాయిక‌గానూ అవ‌కాశం వ‌స్తే ఏ లెవ‌ల్లో ఉంటుందో యూత్ ఊహించుకున్నారు. ఇదిగో ముంబై జుహూలో ఓ  రెస్టారెంట్ కి వెళ్లిన మౌనీ బ్లాక్ డ్రెస్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ లుక్ ఫెంటాస్టిక్ అంటూ పొగిడేస్తున్నారు. ఏక్తా క‌పూర్ ఇంట్లో జ‌రిగిన ఈవెంట్ లోనూ బ్లాక్ డ్రెస్ లోనే ద‌ర్శ‌న‌మిచ్చింది. మొత్తానికి బ్లాక్ లో మౌని ఫెంటాస్టిక్ అంటూ పొగిడేస్తున్నారు బోయ్స్.




Tags:    

Similar News