అభిజిత్ నన్ను చాలా బాధ పెట్టాడు : మోనాల్
బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రత్యేకంగా నిలిచిన కంటెస్టెంట్ ఎవరు అంటే మోనాల్ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రేక్షకులు ఆమెను కోరుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఆమెపై చాలా బ్యాడ్ టాక్ ఉంది. అయినా కూడా ఆమె అనూహ్యంగా అత్యధిక సార్లు సేవ్ అవుతూ వచ్చింది. ఆమె కంటే ఎన్నో రెట్లు స్ట్రాంగ్ అయిన కంటెస్టెంట్స్ అయిన దేవి.. దివి.. కుమార్ సాయి.. మెహబూబ్.. లాస్య వంటి వారు ఎలిమినేట్ అయినా ఆమె మాత్రం కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే ఆమె వల్ల బిగ్ బాస్ వారికి ఫుటేజ్ ఎక్కువ వస్తుంది అనేది టాక్.
మొదట్లో ఆమె అభిజిత్ తో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత అఖిల్ తో క్లోజ్ అయ్యింది. ఒకానొక సమయంలో రాత్రి సమయంలో అభిజిత్ తో మాట్లాడటం డే సమయంలో అఖిల్ తో మూవ్ అవ్వడం చేస్తూ వచ్చింది. ఆమె తీరు నచ్చక పోవడంతో అభిజిత్ ఆమెకు దూరంగా జరిగాడు. ఆ సమయంలో ఆమెతో చాలా కఠినంగా మాట్లాడాడు. నీ ప్రవర్తన నచ్చడం లేదు.. నీతో మళ్లీ మాట్లాడాలనుకోవడం లేదు. నీతో నేను కేవలం టాస్క్ ల కోసమే మాట్లాడుతున్నాను అంటూ నిర్మొహమాటంగా చెప్పాడు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా మోనాల్ తో కనెక్షన్ తో అస్సలు టాస్క్ కూడా వద్దు అన్నాడు. ఆమెతో డేటింగ్ కు వెళ్లాలనే ఆసక్తి నాకు లేదు అంటూ టాస్క్ కు నో చెప్పాడు.
అభిజిత్ నో చెప్పడంతో అఖిల్ ఆమెను డేట్ కు తీసుకు వెళ్లాడు. డేట్ అయిన తర్వాత హారికతో మోనాల్ మాట్లాడింది. ఆ సమయంలో అభిజిత్ తీరుపై సున్నితంగా విమర్శలు చేసింది. తాను చేసిందే కరెక్ట్ అని అభిజిత్ అనుకుంటాడు. కాని అతడు చాలా సార్లు నా విషయంలో తప్పు చేశాడు. నా ముహం ముందే నేను నచ్చడం లేదు అన్నాడు. ఇకపై నీతో మాట్లాడాలని నేను అనుకోవడం లేదు అన్నాడు. అమ్మాయిలతో అలా మొహం మీదే చెప్తే ఎవరైనా తట్టుకోగలరా అంటూ మోనాల్ కన్నీరు పెట్టుకుంది. ఇప్పుడు అభిజిత్ గురించి మోనాల్ మళ్లీ ఎందుకు చర్చిస్తుంది అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.