రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్య కావ్యం బాహుబలి. తొలి భాగంతో ఎవరూ ఊహించని ఊహించలేని విజయాన్ని నమోదు చేశాడు బాహుబలి. ఈ సినిమా సాధించిన రికార్డుల దెబ్బకి.. ఆ తర్వాత వచ్చే ప్రతీ మూవీకి టార్గెట్ ఇదే అవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ అయితే.. టాలీవుడ్ సాధించిన రికార్డులను తుడిచిపెట్టేయడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
బాహుబలి ది బిగినింగ్ సంచలనాల తర్వాత.. గతేడాది చివర్లో బాజీరావు మస్తానీ వచ్చింది. రణవీర్ సింగ్-దీపికా కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాహుబలిని మించిపోతుందని అన్నారు. రిజల్ట్ బాగానే ఉన్నా.. ఆ స్థాయికి చేరుకోవడంలో మాత్రం బాజీరావు ఫెయిలయ్యాడు. ఈ ఏడాది సమ్మర్ స్టార్టింగ్ లో షారూక్ ఖాన్ మూవీ ఫ్యాన్ రిలీజ్ అవుతున్నపుడు కూడా ఇదే హంగామా. చివరకు వంద కోట్లు కూడా వసూలు చేయలేక పోయాడు షారూక్.
ఈద్ కి సుల్తాన్ గా సల్మాన్ వచ్చినపుడు మళ్లీ బాహుబలి రికార్డుల ప్రస్తావన వచ్చింది. ఇవాళ హృతిక్ రోషన్ మూవీ మొహెంజొదారో రిలీజ్ అయింది. దీని టార్గెట్ కూడా బాహుబలి రికార్డులే అంటే ఆశ్చర్యమేమీ లేదు. వరుసగా అందరికీ టార్గెట్ అయిపోతోందంటే.. బాహుబలి రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ ఎవరూ అందుకోలేకపోయిన బాహుబలి స్థాయిని.. మొహెంజొదారో అందుకుంటుందో లేదో తెలియాలంటే.. వీకెండ్ కంప్లీట్ అయ్యేవరకూ ఆగాల్సిందే.