• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోహన్ లాల్-జగపతి సినిమా...

మోహన్ లాల్-జగపతి సినిమా ప్రకంపనలు

By - Tupaki Desk
Update: 2016-10-13 11:30 GMT
మనమంతా.. జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు మోహన్ లాల్. దీంతో మలయాళంలో ఆయన నటించే సినిమాల మీద మన ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. గత నెలలోనే ‘ఒప్పం’ సినిమాతో మలయాళ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు లాల్. ఐతే అది ఎంతైనా ప్రయోగాత్మక చిత్రం. అందులో లాల్ అంధుడి పాత్ర చేశాడు. ఐతే ఇప్పుడు మోహన్ లాల్ లోని మాస్ హీరోను సరిగ్గా వాడుకుంటూ వైశాఖ్ అనే దర్శకుడు రూపొందించిన ‘పులి మురుగన్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ (రూ.25 కోట్లు)తో ఈ సినిమాను తెరకెక్కించడమే కాదు.. అత్యంత భారీగానూ ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేశారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. అంచనాలకు తగ్గట్లే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మలయాళ సినిమాల కలెక్షన్ల రికార్డులు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి. తొలి రోజే రూ.5 కోట్ల వసూళ్లతో ఔరా అనిపించిన ఈ సినిమా.. అత్యంత వేగంగా.. ఐదు రోజుల్లోనే రూ.20 కోట్ల మార్కును అందుకున్న సినిమాగానూ రికార్డు సృష్టించింది. ఫుల్ రన్లో మలయాళ సినిమా రికార్డులన్నీ బద్దలవుతాయని భావిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో మన జగపతిబాబు విలన్ పాత్ర పోషించాడు. ఆయన నటనకు కూడా అక్కడ ప్రశంసలు దక్కుతున్నాయి. ‘పులి మురుగన్’ సినిమాను ఇంగ్లిష్.. హిందీ భాషలతో పాటు చైనా, వియత్నాం అధికారిక భాషల్లోనూ అనువాదం చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మోహన్ లాల్ వెల్లడించాడు. ఈ చిత్రం తెలుగులోకి కూడా అనువాదమయ్యే అవకాశాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Mohanlal 
  • Pulimurugan Movie 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS