పవన్ సినిమాలో సూపర్ స్టార్.. ఇదీ నిజం

Update: 2017-02-19 09:17 GMT
ప్రస్తుతం కాటమరాయుడు చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో పవన్ కళ్యాణ్.. వచ్చే నెల 14 నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నాడనే వార్తలు వినిపించాయి.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కు పెద్దన్న పాత్రలో మోహన్ లాల్ నటించబోతున్నాడనే న్యూస్.. బాగా వైరల్ గా స్ప్రెడ్ అయింది. సహజంగా సీనియర్ స్టార్లకు మంచి పాత్రలు సృష్టిస్తూ ఉంటాడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది చిత్రంలో బొమన్ ఇరానీ.. సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్రలతో ప్రత్యేక కేరక్టర్లతో మెప్పించాడు త్రివిక్రమ్. ఇప్పుడు పవన్ సినిమాలో మోహన్ లాల్ అనగానే చాలామంది వాస్తవమే అనుకోవడానికి కారణం ఇదే. అయితే.. తమ సినిమాలో అలాంటి పాత్ర ఏదీ లేదని చెబుతున్నారు త్రివిక్రమ్ అండ్ టీం.

మోహన్ లాల్ ను ప్రొడక్షన్ యూనిట్ కలిశారనే మాట కూడా వాస్తవం కాదని తేల్చేసింది. మోహన్ లాల్ ను కానీ.. మరే ఇతర సీనియర్ నటుడిని కానీ తీసుకునే ఉద్దేశ్యం లేదని చెప్పేశారు. ఇక పవన్ కాటమరాయుడు షూటింగ్ ను ఈ నెలాఖరుతో పూర్తి చేసేసి.. ఉగాది కానుకగా మార్చ్ లో విడుదల చేసేయనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News