• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోహన్ లాల్ మరో సర్...

మోహన్ లాల్ మరో సర్ ప్రైజ్..

By - Tupaki Desk
Update: 2018-08-10 10:23 GMT
సినిమా అంటేనే క్రియేటివిటీ.. ఎంత సృజనాత్మకంగా చూపిస్తే సినిమా అంత విజయం అవుతుంది. మూసధోరణితో సినిమాలు చేస్తే ఫ్లాపులు పలకరిస్తాయి. అందుకే ఈ మధ్య మన అగ్ర హీరోలు సినిమాలు తగ్గించేశారు. కొత్త కథలు రాకపోవడం.. అవే మూస సినిమాలు చేయడం ఇష్టం లేక వెంకటేశ్ - నాగార్జున - చిరంజీవిలు కాస్తా ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు.

కానీ మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ అలా కాదు.. తన ఏజ్ పెరిగిన కొలదీ.. విలక్షణ కథలను ఎంచుకుంటూ అందులో పరకాయ ప్రవేశం చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. ఇటీవలే తెలుగులో రిలీజ్ డబ్బింగ్ అయిన మోహన్ లాల్ నటించిన ‘కనుపాప’ చిత్రం మలయాళంలో పెద్ద హిట్.. అగ్రహీరో అయ్యిండి ఈ సినిమాలో అంధుడిగా మోహన్ లాల్ నటించి మెప్పించాడు. ఇంత సాహసోపేతమైన డీగ్లామర్ పాత్ర చేయడానికి ఏ టాలీవుడ్ హీరో కూడా సాహసించడంటే అతిశయోక్తి కాదు.. అలా విలక్షణంగా వెళుతున్నాడు కాబట్టే ఆయనకు విజయాలు వరిస్తున్నాయి.

తాజాగా మోహన్ లాల్ మరో సంచలన చిత్రంలో నటిస్తుంటాడు. ‘ఒడియన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ కథలో మోహన్ లాల్ విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. యుక్త వయస్కుడిగా.. పండు ముసలివాడిగా.. అలాగే కొన్ని సార్లు జంతువుగా మారిపోతాడట.. ఇలా మూడు నాలుగు పాత్రల కోసం తాజాగా మోహన్ లాల్ బాగా సన్నబడి షాకింగ్ లుక్ లోకి మారిపోయాడు. సినిమా లో చూస్తే అందరూ షాక్ అవ్వడం ఖాయమని చిత్రం యూనిట్ చెబుతోంది. శ్రీకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Tags:    
  • Mohan Lal 
  • Odiyan Movie 
  • Telugu NEws 

Similar News

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

Copyright @2026

Powered by Blink CMS