ముక్కు సూటి వ్యవహారం గిట్టని లోకం ఇది. ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడితే ఉలికులుక్కి పడుతుంది. అన్నవాడిని ఏదోలా నాశనం చేయాలని చూస్తుంది. అందుకే ఇప్పుడున్న మనుషుల్లో 99 శాతం సూటిగా మాట్లాడేందుకు జంకే పరిస్థితి. అయితే ఇలాంటి తిరకాసు ప్రపంచంలో సూటి పోటు వ్యాఖ్యలతో ముచ్చెమటలు పట్టించే ఆ ఒక్కడు ఎవరు అంటే.. ఆయనే ఎం.మోహన్‌బాబు. టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా సుప్రసిద్ధుడు. అతడి మాట తీరు - ఆహార్యం - వ్యవహార శైలి అన్నీ సూటిగానే ఉంటాయి. ఎవరి గురించి మాట్లాడాలన్నా ఆయన గళం ఎలాంటి అదురూ బెదురూ లేకుండా గలగలలాడేస్తుంది.
అందుకే ఇప్పుడు ఆయన తన 40 ఏళ్ల సినీజీవితాన్ని, ఆ పయనంలో అనుభవాల్ని పుస్తకరూపంలో తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు... అనగానే జనాలందరిలో బోలెడన్ని సందేహాలు. ఈ పయనంలో ఎన్నో ఎన్నెన్నో. అతడి గురించి దగ్గరగా తెలిసినవారికి తెలిసిన నిజాలెన్నో. వాటన్నిటినీ ఈ పుస్తకంలో ఆయన అంతే సూటిగా రాసేస్తే పరిస్థితేంటి? అదంతా వివాదాల మయం అయితే ఏంటి పరిస్థితి? అలాగని పుస్తకంలో అంతా రొటీన్ సుత్తి ఉంటే ఆదరణ ఎలా దక్కుతుంది? కాబట్టి టాలీవుడ్ సెలబ్రిటీస్ లో అత్యంత రీడబులిటీ ఉండే పుస్తకంగా మోహన్ బాబు ఆత్మకథ ఉండాలంటే అందులో సంథింగ్ ఉండాల్సిందేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మల్లెమాల (ఎం.ఎస్.రెడ్డి ఆత్మకథలా) ముక్కుసూటి తనం అక్షరాల రూపంలో కనిపించాల్సిందే. వచ్చే ఏడాదిలోనే ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తారన్న సమాచారం ఉంది. కాబట్టి ఆయన పుస్తకం ఎలాంటి సంచలనాలకు కారణం అవుతుందో తెలుసుకోవాలంటే.. అందాకా వేచి చూడాల్సిందే.