'చదరంగం'ను ఆడించేది మోహన్‌ బాబే

Update: 2020-02-19 16:57 GMT
మంచు విష్ణు నిర్మాణంలో రాజ్‌ అనంత దర్శకత్వంలో రూపొందుతున్న చదరంగం వెబ్‌ సిరీస్‌ టీజర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది నందమూరి తారక రామారావు బయోపిక్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాని మంచు ఫ్యామిలీ సన్నిహితులు మాత్రం అది అన్నగారి బయోపిక్‌ అంటున్నారు.

ఈ బయోపిక్‌ కు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటీ అంటే దీనికి కథను మోహన్‌ బాబు అందిస్తున్నాడట. రచన సహకారం పూర్తిగా మోహన్‌ బాబు అందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అన్నగారితో ఆయనకు ఉన్న అనుబంధం అందరికి తెల్సిందే. అందుకే ఆయన అయితే ఈ వెబ్‌ సిరీస్‌ కు మంచి స్క్రిప్ట్‌ అందిస్తాడని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అనుకుంటున్నారు.

అంతా బాగానే ఉంది కాని ఎన్టీఆర్‌ వెన్ను పోటు విషయం కూడా ఇందులో ఉంటుందా.. ఉంటే ఆయన గురించి కూడా ఇందులో కాస్త గట్టిగానే ఉండవచ్చు కదా అంటూ రాజకీయ వర్గాల్లో కూడా గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం వైకాపాలో ఉన్న మోహన్‌ బాబు అండ్‌ ఫ్యామిలీ ఆయన గురించి ఈ వెబ్‌ సిరీస్‌ లో చాలా స్ట్రాంగ్‌ గానే కౌంటర్‌ వేస్తారేమో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ చివరి రోజులపై ఈ వెబ్‌ సిరీస్‌ ఎక్కువ ఫోకస్‌ ఉండవచ్చు అనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ఈ వెబ్‌ సిరీస్‌ జీ5 ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ పై స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.
Tags:    

Similar News