పోలింగ్ కు కొన్ని గంటల ముందు మోహన్ బాబు 'మా' సందేశం..!
'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల అంఖం చివరి దశకు వచ్చేసింది. రేపు ఆదివారం పోలింగ్ కోసం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. పోలింగ్ కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు ప్యానెల్ - ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. 'మా' సభ్యులను ఆకర్షించడానికి చివరి అస్త్రాలను ప్రయోగిస్తూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో తనయుడు మంచు విష్ణుకు ఓటు వేయాలని ‘మా’ సభ్యులను కోరుతూ మంచు మోహన్ బాబు ఓ వాయిస్ మెస్సేజ్ పంపారు.
'మా' ఎన్నికల్లో తన బిడ్డ మంచు విష్ణు ను గెలిపించాలని సభ్యులకు విజ్ఞప్తి చేసిన మోహన్ బాబు.. గెలిచిన తర్వాత విష్ణు మేనిఫెస్టోలో ఉన్న హామీలను తప్పక నెరవేరుస్తారనే నమ్మకం తనకుందన్నారు. కొందమంది సభ్యులు బజారున పడి నవ్వుల పాలవుతున్నారని.. ఆలోచించి ఓటు వేయాలని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ''తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్నికల పరిస్థితి చూస్తే మనసుకు కష్టంగా ఉంది. అసలు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారు. అయితే కొంతమంది సభ్యులు రోడ్డునపడి నవ్వులపాలవుతున్నారు. ఎవరు ఏం చేసినా 'మా' అనేది ఒక కుటుంబం. విష్ణు గెలిచాక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందాం. మేనిఫెస్టోలోని హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. విష్ణు మీ కుటుంబ సభ్యుడు. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి'' అని మోహన్ బాబు అన్నారు.
అంతకుముందు తనయుడు మంచు విష్ణు ప్యానెల్ కి ఓటు వేయాలని కోరుతూ మోహన్ బాబు ఓ లేఖని విడుదల చేశారు. ''నా క్రమశిక్షణకీ, నా అంకిత భావానికి వారసుడైన నా కుమారుడు విష్ణు మంచు ఈ ఊళ్లోనే ఉంటాడు. ఏ సమస్య వచ్చినా సభ్యుల పక్కన నిలబడి ఉంటాడని నేను మాటిస్తున్నా'' అని విలక్షణ నటుడు అన్నారు. తాను ‘మా’ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడే వృద్ధాప్య పింఛన్లని ప్రవేశపెట్టానని.. ఆ పదవి అంటే కిరీటం కాదు, అదొక బాధ్యత అని తెలిపారు. ''చేసిన సాయం ఇచ్చిన దానం ఎవరికీ చెప్పకూడదు అంటారు. కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించిన రోజు నుంచి, ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్ని నిర్మిస్తూ ఎంతోమంది సాంకేతిక నిపుణులను, కళాకారులను పరిచయం చేయటమే కాకుండా 24 క్రాప్ట్స్ లో ఉన్న వారి పిల్లలకు తను స్థాపించిన విద్యా సంస్థలలో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించానను, ఇకపై కొనసాగిస్తాము'' అని చెప్పారు. ఓటును ఆలోచించి అందరి బాగు కోసం తాపత్రయపడుతున్న తన కుమారుడు మంచు విష్ణు కు తన ప్యానెల్ కు వేసి గెలిపించాలని మోహన్ బాబు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.