మగబిడ్డకు జన్మనిచ్చిన 'మిర్చి' హీరోయిన్..!

Update: 2021-06-05 07:30 GMT
టాలీవుడ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మే 27న తనకు బాబు పెట్టాడని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రసవ సమయంలో తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు రిచా వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బందికి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తమకు పుట్టిన బాబు ఫోటోని షేర్ చేసింది రిచా.

కాగా, 'లీడర్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ.. ఆ తర్వాత 'నాగవల్లి', 'మిరపకాయ్' 'భాయ్' వంటి సినిమాల్లో నటించింది. ప్రభాస్ తో చేసిన 'మిర్చి' సినిమా ఆమెకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. తమిళంలో 'మాయక్కమ్ ఎన్న'(తెలుగులో Mr. కార్తిక్) - 'ఒస్తే'.. బెంగాలీలో 'బిక్రమ్ సింఘా' చిత్రాల్లో నటించింది. 'భాయ్' తర్వాత సినిమాలకు దూరమైన రిచా.. ఉన్నత చదువుల కోసమని అమెరికా వెళ్లిపోయింది.

ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను ప్రేమించి, 2019లో సీక్రెట్‌ గా పెళ్లి చేసుకుంది రిచా. వివాహమయ్యాక చాలా రోజులకు కానీ తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇక ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా సీక్రెట్‌ గా ఉంచిన రిచా.. ఇటీవల బేబీ బంప్ తో ఫోటోని చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. ఫిబ్ర‌వరిలో తాను త‌ల్లి కాబోతున్న‌ట్టు తెలియ‌జేసిన రిచా గంగోపాధ్యాయ.. ఇప్పుడు త‌న‌కు మ‌గ బిడ్డ పుట్టిన‌ట్టు వెల్లడించారు.
Tags:    

Similar News