క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పై హోప్స్ పెట్టుకున్న మిల్కీ బ్యూటీ...!

Update: 2020-09-05 23:30 GMT
స్టార్ యాక్టర్స్ అందరూ రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే హవా కాబోతోందని భావించి ఒక్కొక్కరుగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సమంత - ప్రియమణి - కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటించారు. ఇప్పుడు వీరి దారిలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నడవనుంది. తమిళ్ లో రూపొందుతున్న ''ది నవంబర్స్ స్టోరీ'' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో తమన్నా నటించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ కి రామ సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహించారు. ఇప్ప‌టికే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ ముగిసిందని సమాచారం. వ‌చ్చే నెల‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగులో 'సీటీమార్' సినిమాలో నటిస్తున్న తమన్నా డిజిటల్ మీడియా డెబ్యూ పై హోప్స్ పెట్టుకుందని తెలుస్తోంది. మరి అమ్మడు వెబ్ వరల్డ్ లో కూడా సత్తా చాటుతుందేమో చూడాలి.

ఇదిలా ఉండగా మిల్కీ బ్యూటీ 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'లవ్ మాక్ టైల్' చిత్రానికి తెలుగు రీమేక్ గా రానుంది. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌ పై నాగశేఖర్ రూపొందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి త‌మ‌న్నా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం మిల్కీ బ్యూటీ రెమ్యూనరేషన్ కి సంబంధించిన డీల్ స‌రిగ్గా సెట్ అవకపోవడమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేష‌న్ లో ఉన్న త‌మ‌న్నా.. త్వరలోనే నిర్మాత‌తో ఈ మూవీ గురించి స్వ‌యంగా చ‌ర్చించి ఓ అభిప్రాయానికి వస్తారని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News